హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Hyderabad Jobs 2022: ఐఐటీ హైదరాబాద్ లో పలు పోస్టుల భర్తీ.. డిగ్రీ, పీజీ అర్హత.. వివరాలిలా..

IIT Hyderabad Jobs 2022: ఐఐటీ హైదరాబాద్ లో పలు పోస్టుల భర్తీ.. డిగ్రీ, పీజీ అర్హత.. వివరాలిలా..

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.  IIT Hyderabad ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనుంది. అందులో చీఫ్ లైబ్రరీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, ఇన్‌స్ట్రక్టర్, టెక్నీషియన్, మల్టీ స్కిల్ అసిస్టెంట్(Multi Skill Assistant) ఖాళీల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ను(Notification) విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు IIT హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అధికారికి వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు దరఖాస్తు (Application) చేసుకోవడానికి చివరి తేదీగా 19 సెప్టెంబర్ 2022గా పేర్కొన్నారు. దీనికి దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 19 నుంచి మొదలైంది. దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ వెబ్ సైట్ లింక్ https://staff.recruitment.iith.ac.in/ ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి, విద్యార్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలను తెలుసుకుందాం..

Telangana New Jobs: తెలంగాణలో కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం..


వయో పరిమితి..

అభ్యర్థుల వయోపరిమితి కనీసం 40 సంవత్సరాలు ఉండాలి.

వయో సడలింపు: SC/ ST/OBC/PWD/ PH అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: 19 ఆగస్టు 2022.

దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 19 సెప్టెంబర్ 2022.

అర్హతలు..

సంబంధిత పోస్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాలి. వీటితో పాటు.. పని అనుభవం కూడా ఉండాలి. లైబ్రరీ పోస్టులకు మాస్టర్ లైబ్రరీ కోర్సు చేసి ఉండాలి.

పే స్కేల్

చీఫ్ లైబ్రరీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, ఇన్‌స్ట్రక్టర్, టెక్నీషియన్, మల్టీ స్కిల్ అసిస్టెంట్ పోస్ట్ పే స్కేల్ లెవల్-4 ద్వారా చెల్లిస్తారు. ని పే స్కేల్ వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి.

ఫీజు వివరాలు..

అభ్యర్థులందరూ రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

- ముందుగా అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్ ను సందర్శించాలి.

-తర్వాత కెరీర్ అనే ఆప్షన్ కు వెళ్లాలి. ఇక్కడ IIT Hyderabad Staff Recruitment అనే దానిపై క్లిక్ చేయాలి.

-దీనిలో నోటిఫికేషన్ పీడీఎఫ్ మరియు అప్లై ఆన్ లైన్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వివరాలను మరోసారి చెక్ చేసుకోవాలంటే.. నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

-తర్వాత అప్లై ఆన్ లైన్ పై క్లిక్ చేసి.. వివరాలను నమోదు చేయాలి.

-చివరగా దరఖాస్తు ఫారమ్ నింపిన తర్వాత.. ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇది భవిష్యత్ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను నియమించనున్నారు. పూర్తి వివరాల కొరకు నోటిఫికేషన్ ను తనిఖీ చేయండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IIT Hyderabad, Iit jobs, JOBS

ఉత్తమ కథలు