భారతీయ జాబ్ మార్కెట్ (Indian Job Market)లో ఫ్రెషర్స్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుత జులై- డిసెంబర్ అర్ధ సంవత్సరానికి సంబంధించి వివిధ రంగాల్లో ఉద్యోగ నియామకాలు, అవకాశాలు (hiring intentions) భారీగా పెరిగినట్లు ఎడ్యుటెక్ కంపెనీ టీమ్‌లీజ్ (TeamLease) నివేదిక వెల్లడించింది. తాజాగా ఈ కంపెనీ విడుదల చేసిన కెరీర్ అవుట్‌లుక్ (Career Outlook) రిపోర్టు ప్రకారం.. ఈ ఏడాది జులై- డిసెంబర్ పీరియడ్‌లో హైరింగ్ ఇంటెన్షన్స్ 61 శాతం పెరిగాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలు (Fresher Jobs) లభిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది.
ఇండియన్ జాబ్ మార్కెట్‌లో ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు ఎడ్యుటెక్ కంపెనీ టీమ్‌లీజ్ (TeamLease) ఫౌండర్, సీఈఓ శాంతను రూజ్. అయితే అభ్యర్థులు ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్లు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని తెలిపారు. దాంతో పాటు టెక్నాలజీ, డిజిటల్ అడ్వాన్స్‌మెంట్స్‌పైన అనుభవం సంపాదించాలని సూచించారు. ‘ప్రతిభ ఉన్న విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకుంటే వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు లభించి సరైన మార్గంలో ముందుకు వెళ్తారు. ఫ్రెషర్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది.’ అని శాంతను రూజ్ వెల్లడించారు.
IT Companies: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన Wipro, Infosys, Tech Mahindra కంపెనీలు.. ఏం జరిగిందంటే..
ఐటీ, ఈ-కామర్స్ రంగాల్లో జోరుగా నియామకాలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ-కామర్స్ రంగాల్లో జోరుగా నియామకాలు జరుగుతున్నాయి. ఈ రంగాల వారు ఫ్రెషర్లను అధిక సంఖ్యలో హైర్ చేసుకుంటున్నారు. 2022 జులై-డిసెంబర్ పీరియడ్‌లో హైరింగ్ ఇంటెన్షన్స్ గతేడాదితో పోల్చితే 30 శాతం పెరిగాయి. ఇందులో ఎక్కువ శాతం ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్న మొదటి నాలుగు పరిశ్రమలుగా 34 శాతంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 23 శాతంతో ఈ-కామర్స్ & టెక్నాలజీ స్టార్టప్‌లు, 22 శాతంతో టెలికమ్యూనికేషన్, 20 శాతంతో ఇంజనీరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక మార్కెట్‌లో మార్కెటింగ్ స్పెషలిస్ట్, మాలిక్యులర్ బయాలజిస్ట్, బ్యాక్ ఎండ్ డెవలపర్ రోల్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఫ్రెషర్స్ ఈ రోల్స్‌కు అవసరమయ్యే నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే అతి త్వరగా ఉద్యోగాలు సంపాదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నగరాల్లో ఎక్కువ అవకాశాలు
బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ , ఢిల్లీ నగరాలలో ఫ్రెషర్స్‌కు అత్యధిక అవకాశాలు లభిస్తున్నాయి. 2022 రెండో భాగంలో బెంగళూరు నగరంలో 25 శాతం డిమాండ్ కనిపిస్తోంది. ఆ తర్వాత ముంబై 19 శాతం, ఢిల్లీ 18 శాతం ఫ్రెషర్స్‌ను హైర్ చేసుకున్నాయి. డిగ్రీ వారీగా ఏయే అభ్యర్థులను ఎంత శాతం హైర్ చేసుకున్నారో పరిశీలిస్తే.. బ్యాచిలర్స్ డిగ్రీలు 17 శాతం, డిప్లొమా ఉన్న వారిని 11 శాతం ఆయా కంపెనీలు నియమించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాబ్ మార్కెట్(Job Market) పరిస్థితులను భారతదేశ మార్కెట్‌తో పోల్చితే 2022 జులై-డిసెంబర్ మధ్య స్థిరంగా ఉంది. భారతీయ మార్కెట్‌లో ఫ్రెషర్స్‌ను రిక్రుట్ చేసుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయని టీమ్‌లీజ్ నివేదిక స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Freshers, IT jobs, JOBS, Private Jobs