Jobs: రూ.33,000 స్టైపెండ్‌తో అగ్రికల్చర్ ట్రైనీ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

IFFCO Agriculture Graduate Trainee Recruitment | శిక్షణ సమయంలో రూ.33,000 స్టైపెండ్ లభిస్తుంది. ఆ తర్వాత రూ.37,000 బేసిక్ వేతనం, అలవెన్సులు ఉంటాయి.

news18-telugu
Updated: September 3, 2019, 11:59 AM IST
Jobs: రూ.33,000 స్టైపెండ్‌తో అగ్రికల్చర్ ట్రైనీ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
Jobs: రూ.33,000 స్టైపెండ్‌తో అగ్రికల్చర్ ట్రైనీ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 3, 2019, 11:59 AM IST
అగ్రికల్చర్‌లో డిగ్రీ పూర్తి చేసినవారికి శుభవార్త. అగ్రికల్చర్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటీవ్ లిమిటెడ్-IFFCO. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులు కేవలం అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీలకు మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 5 చివరి తేదీ. కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమినరీ టెస్ట్, ఫైనల్ ఆన్‌లైన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.33,000 స్టైపెండ్ లభిస్తుంది. ఆ తర్వాత రూ.37,000 బేసిక్ వేతనం, అలవెన్సులు ఉంటాయి. అగ్రికల్చర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

IFFCO Agriculture Graduate Trainee Recruitment: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 5

విద్యార్హత: అగ్రికల్చర్‌లో 4 ఏళ్ల ఫుల్ టైమ్, రెగ్యులర్ బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసినవాళ్లు అర్హులు. చివరి సెమిస్టర్ పరీక్ష రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీ విద్యార్థులు 60%, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 55% మార్కులతో పాస్ కావాలి. ఎంఎస్సీ అగ్రికల్చర్ రెండేళ్ల ఫుల్ టైమ్ కోర్సు పూర్తి చేసినవాళ్లు కూడా అర్హులే.
వయస్సు: 2019 సెప్టెంబర్ 1 నాటికి 30 ఏళ్లు. క్రీమీలేయర్‌లో లేని ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.



Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి
Loading...


ఇవి కూడా చదవండి:

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

CAG Recruitment 2019: కాగ్‌లో 182 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

DRDO Jobs: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు
First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...