Alert: దుబాయ్‌లో ఉద్యోగమా? మోసపోతారు జాగ్రత్త అంటున్న ఇండియన్ ఎంబసీ

ఎవరైనా ఇకపై దుబాయ్‌లో ఉద్యోగం ఉందని చెప్తే... ముందుగా వారి ఖతార్ ఐడీ తెలుసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచిస్తోంది.

news18-telugu
Updated: April 29, 2019, 6:53 PM IST
Alert: దుబాయ్‌లో ఉద్యోగమా? మోసపోతారు జాగ్రత్త అంటున్న ఇండియన్ ఎంబసీ
Alert: దుబాయ్‌లో ఉద్యోగమా? మోసపోతారు జాగ్రత్త అంటున్న ఇండియన్ ఎంబసీ (image: Reuters)
news18-telugu
Updated: April 29, 2019, 6:53 PM IST
దుబాయ్‌లో ఉద్యోగం పేరుతో జరుగుతున్న మోసాలెన్నో. మరి మీరు కూడా దుబాయ్‌లో ఉద్యోగానికి ట్రై చేస్తున్నారా? ఖతార్‌లో జాబ్ ఉందని ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? అయితే జాగ్రత్తగా ఉండాలంటోంది దోహాలోని ఇండియన్ ఎంబసీ. దుబాయ్, ఖతార్‌లో ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతుండటంతో... ఉద్యోగార్థుల్ని ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేస్తోంది. దుబాయ్‌లో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించే ఫేక్ ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటోంది. ఎవరైనా ఇకపై దుబాయ్‌లో ఉద్యోగం ఉందని చెప్తే... ముందుగా వారి ఖతార్ ఐడీ తెలుసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచిస్తోంది. ఏజెంట్ల ఐడీ తెలుసుకుంటే ఒకవేళ మోసపోయినా సులువుగా సాయం పొందొచ్చని, బిజినెస్, విజిట్ వీసాలపై ఖతార్‌లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్తే అస్సలు నమ్మొద్దని చెబుతోంది.

Read this: Airlines Jobs: ఇంటర్ పాసైతే చాలు... విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు





దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో వల వేసే నకిలీ ఏజెంట్లు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నారు. దీంతో అసలు ఏజెంట్లు ఎవరో నిరుద్యోగులకు తెలుసుకునే అవకాశమే ఉండట్లేదు. నకిలీ ఏజెంట్ల నిజమైన ఏజెంట్లు అని నమ్మేసి లక్షలకు లక్షలు సమర్పించుకున్న ఘటనలెన్నో ఉన్నాయి. 2017 లెక్కల ప్రకారం ఖతార్‌లో 6,50,000 మందికి పైగా భారతీయులు ఉద్యోగం చేస్తున్నారని అంచనా.
Loading...
Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:

Paytm Credit Score: పేటీఎంలో క్రెడిట్ స్కోర్... ఒక్క నిమిషంలో చెక్ చేసుకోవచ్చు ఇలా

PAN Card: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డీయాక్టివేట్... కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం

Aadhaar Card: ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోండి ఇలా...
First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...