Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో యాంత్రిక్ పోస్టుల భర్తీ... నోటిఫికేషన్ వివరాలివే

Indian Coast Guard Yantrik Recruitment 2020 | ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగం మీ కలా? ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 25, 2020, 11:13 AM IST
Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో యాంత్రిక్ పోస్టుల భర్తీ... నోటిఫికేషన్ వివరాలివే
Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో యాంత్రిక్ పోస్టుల భర్తీ... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 37 ఖాళీలను భర్తీ చేయనుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ విభాగాల్లో యాంత్రిక్ టెక్నికల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 16న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు మార్చి 22 చివరి తేదీ. ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో డిప్లొమా పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. డిప్లొమాలో సాధించిన మార్క్స్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్ https://joinindiancoastguard.gov.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.

Indian Coast Guard Yantrik Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 37

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 22
విద్యార్హత- ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ (రేడియో / పవర్) ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో డిప్లొమా 60% మార్కులతో పాస్ కావాలి.


వయస్సు- 18 నుంచి 22 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.ఎంపిక ప్రక్రియ- రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Job Mela: మొత్తం 730 పోస్టుల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు

Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు
First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు