మీకు దేశానికి సేవ చేయాలనే స్ఫూర్తి ఉంటే ఇక్కడ చెప్పే ఉద్యోగ నోటిఫికేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ joinindiancoastguard.govను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 17 ఆగస్టు 2022 నుండి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ 7 సెప్టెంబర్ 2022గా నిర్ణయించబడింది.
పోస్టులు..వయోపరిమితి
టెక్నికల్ (మెకానికల్): 01 జూలై 1997 నుండి 30 జూన్ 2001 మధ్య జన్మించారు అర్హులు. కోస్ట్ గార్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి 05 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
టెక్నికల్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): 01 జూలై 1997 నుండి 30 జూన్ 2001 మధ్య జన్మించారు. కోస్ట్ గార్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి 05 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
లా ఎంట్రీ: 01 జూలై 1993 నుండి 30 జూన్ 2001 మధ్య జన్మించినవారు. కోస్ట్ గార్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి లేదా ఆర్మీ/నేవీ/వైమానిక దళంలో సమానమైన సిబ్బందికి 05 సంవత్సరాల సడలింపు.
జనరల్ డ్యూటీ (GD): 01 జూలై 1997 నుండి 30 జూన్ 2001 మధ్య జన్మించారు అర్హులు. కోస్ట్ గార్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి లేదా ఆర్మీ/నేవీ/వైమానిక దళంలో సమానమైన సిబ్బందికి 05 సంవత్సరాల సడలింపు.
కమర్షియల్ పైలట్ లైసెన్స్ (SSA): 01 జూలై 1997 నుండి 30 జూన్ 2003 మధ్య జన్మించారు అర్హులు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 71 అసిస్టెంట్ కమాండెంట్ల పోస్ట్‌లు రిక్రూట్ చేయబడతాయి. ఇందులో జనరల్ కేటగిరీకి 31, ఆర్థికంగా బలహీన వర్గాలకు 4(EWS), ఇతర వెనుకబడిన తరగతులకు(OBC) 20, షెడ్యూల్డ్ కులాలకు(SC) 6, షెడ్యూల్డ్ తెగలకు(ST) 10 పోస్టులను చేర్చారు.
విద్యార్హత
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో వివిధ శాఖలలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్థులు పది, ఇంటర్మీడియట్ , డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వివిధ రకాల పోస్టులకు విద్యార్హత మారుతూ ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56 వేల 100 చొప్పున జీతం ఇవ్వబడుతుంది .
దరఖాస్తు ఫీజు..
రూ.250 దరఖాస్తు ఫీజును చెల్లించాలి. ట్ బ్యాంకింగ్ లేదా వీసా/మాస్టర్/మాస్ట్రో/రూపే/క్రెడిట్/డెబిట్ కార్డ్/UPIని ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్ మోడ్ లో ఈ ఫీజు చెల్లించవచ్చు. SC/ST అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు.
దరఖాస్తు ఇలా..
- ముందుగా అధికారిక వెబ్ సైట్ joinindiancoastguard.gov.inను సందర్శించాలి.
- అందులో ఈ మెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్స్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు.. వ్యక్తిగత వివరాలను కూడా నమోదు చేయాలి.
-తర్వాత దరఖాస్తు ఫారమ్ కు మెయిన్ వెబ్ సైట్ కు వచ్చి.. లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
-తగిన ధ్రువపత్రాలు, ఫొటో, సిగ్నేచర్ లాంటివి అప్ లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను ముగించవచ్చు.
-చివరకు దరఖాస్తు చేసుకున్న పీడీఎఫ్ ఫాంను డౌన్ లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కొరకు దాచుకోవాలి.
గమనిక.. దరఖాస్తు ప్రక్రియ 17 ఆగస్టు 2022 నుంచి మొదలవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army jobs, Career and Courses, Indian Coast Guard, JOBS