• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN COAST GUARD RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 358 NAVIK AND YANTRIK POSTS KNOW HOW TO APPLY SS

Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 358 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 358 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 358 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Indian Coast Guard Recruitment 2021 | ఇండియన్ కోస్ట్ గార్డ్ 358 పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. నావిక్, యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో నావిక్, యాంత్రిక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 358 ఖాళీలున్నాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://joinindiancoastguard.cdac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 19 చివరి తేదీ.

    Indian Coast Guard Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 358
    నావిక్ (జనరల్ డ్యూటీ)- 260
    నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)- 50
    యాంత్రిక్ (మెకానికల్)- 31
    యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)- 10
    యాంత్రిక్ (ఎలక్ట్రికల్)- 7

    Jobs: మజగాన్ డాక్‌లో 410 జాబ్స్... చివరి తేదీ ఎప్పుడంటే

    BEL Recruitment 2021: డిప్లొమా పాసైనవారికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 305 ఉద్యోగాలు

    Indian Coast Guard Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 5
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 19 సాయంత్రం 6 గంటలు
    విద్యార్హతలు- నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 పాస్ కావాలి. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు 10వ తరగతి పాసైతే చాలు. యాంత్రిక్ పోస్టులకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాస్ కావాలి.
    వయస్సు- 18 నుంచి 22 ఏళ్లు.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు ఫీజు- రూ.250
    వేతనం- నావిక్ పోస్టుకు రూ.21,700 + డీఏ + ఇతర అలవెన్సులు, యాంత్రిక్ పోస్టులకు రూ.29,200 + డీఏ + ఇతర అలవెన్సులు.

    LIC Agent Jobs 2021: టెన్త్ పాసైతే ఎల్ఐసీ ఏజెంట్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్‌లో 150 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Indian Coast Guard Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన విద్యార్హతలు ఉంటే దరఖాస్తు మొదలుపెట్టాలి.
    NAVIK (GENERAL DUTY), NAVIK(DOMESTIC BRANCH) AND YANTRIK 02/2021 BATCH అడ్వర్టైజ్‌మెంట్ సెలెక్ట్ చేయాలి.
    అందులో పోస్ట్ సెలెక్ట్ చేయాలి.
    I Agree బటన్ క్లిక్ చేసి Online Application ప్రారంభించాలి.
    అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
    మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
    ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి వివరాలన్నీ ఓసారి చెక్ చేసుకోవాలి.
    Submit పైన క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
    దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: