Jobs: ఇంటర్ అర్హతతో కోస్ట్ గార్డ్‌లో 260 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

Indian Coast Guard Recruitment 2020 | ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 26న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 2 చివరి తేదీ.

news18-telugu
Updated: January 25, 2020, 9:27 AM IST
Jobs: ఇంటర్ అర్హతతో కోస్ట్ గార్డ్‌లో 260 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు
Jobs: ఇంటర్ అర్హతతో కోస్ట్ గార్డ్‌లో 260 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇంటర్ పాసయ్యారా? ఇండియాన్ కోస్ట్ గార్డ్ నావిక్-జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తుల్ని స్వీకరించనుంది. మొత్తం 260 ఖాళీలున్నాయి. యువకులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ www.joinindiancoastguard.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 మధ్య దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు 2020 జనవరి 4-10 ఎంప్లాయిమెంట్ న్యూస్‌పేపర్‌లో ఉంటాయి.

Indian Coast Guard Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


నావిక్-జనరల్ డ్యూటీ పోస్టులు- 260

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 2
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- 2020 ఫిబ్రవరి 15 నుంచి 22


పరీక్ష- 2020 ఫిబ్రవరి లేదా మార్చివిద్యార్హత- మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లతో 10+2 పాస్ కావాలి.
వయస్సు- 18 నుంచి 22 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

Indian Coast Guard Recruitment 2020: అప్లై చేయండి ఇలా...


ముందుగా www.joinindiancoastguard.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Recruitment of Naviks (10+2 Entry) 02/2020 Batch లింక్ క్లిక్ చేయాలి.
మీ వివరాలతో ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 జాబ్స్... ఖాళీల వివరాలివే

SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

 

 
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు