Home /News /jobs /

INDIAN COAST GUARD HIRING FOR 322 POSTS 10TH PASS CAN APPLY SALARY UP TO RS 29200 JOININDIANCOASTGUARD CDAC IN GH VB

10Th-Inter Jobs: టెన్త్ , ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త.. నెలకు రూ.30 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tenth, Inter Jobs: పది, ఇంటర్ చదివిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఎంపికైతే నెలకు రూ.30 వేల జీతం ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. 322 నావిక్ (Navik), యాంత్రిక్ (Yantrik) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ www.joinindiancoastguard.cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 14లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఏ పోస్టులో ఎన్ని ఖాళీలు..?

ఈ నోటిఫికేషన్​ ద్వారా మొత్తం 322 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 260 నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్ట్​లు, 35 నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), 13 యాంత్రిక్ (మెకానికల్), 9 యాంత్రిక్ (ఎలక్ట్రికల్), 5 యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) ఖాళీలున్నాయి.

Scholarships: ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం యూజీసీ నాలుగు కొత్త స్కాలర్​షిప్స్​.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే..


అర్హత ప్రమాణాలేంటి..?
నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథ్స్​, ఫిజిక్స్​ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక, యాంత్రిక్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

IIT Mentorship: స్కూల్ గర్ల్స్ కోసం STEM మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌.. తాజాగా ప్రారంభించిన ప్రముఖ విద్యాసంస్థ..


ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

1. ముందు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. మీ ఈ–మెయిల్ ఐడి లేదా ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్​ చేసుకోండి. ఆ తర్వాత లాగిన్ అవ్వండి.

3. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

4. ఎగ్జామ్​ ఫీజు చెల్లించండి.

5. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.

దరఖాస్తు రుసుము ఎంత..?
అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ లేదా వీసా/మాస్టర్/మాస్ట్రో/రూపే క్రెడిట్/డెబిట్ కార్డ్/యూపీఐ విధానాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Cashless Car Insurance: క్యాష్‌లెస్‌ కార్‌ ఇన్సూరెన్స్‌ అంటే ఏంటి..? దీనితో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..?


సెలక్షన్​ ప్రాసెస్​..
మొత్తం మూడు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో కంప్యూటర్ బేస్ట్​ టెస్ట్​ నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనిలోనూ అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్​ టెస్ట్​లు నిర్వహించి ఫైనల్​ మెరిట్​ లిస్ట్​ ప్రకటిస్తారు. ఎంపికైన వారికి ఐఎన్​ఎస్​ చిల్కాలో శిక్షణనిస్తారు. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)కి ఎంపికైన వారికి రూ. 21700, యాంత్రిక్ పోస్టులకు అభ్యర్థులు రూ. 29200 నెలవారీ జీతం చెల్లిస్తారు. వీటికి అదనంగా అలవెన్సులు కూడా ఉంటాయి.
Published by:Veera Babu
First published:

Tags: Army jobs, Central Government, Central Government Jobs, JOBS

తదుపరి వార్తలు