Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Bank SO Recruitment 2020 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.indianbank.in/ వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: February 8, 2020, 9:42 AM IST
Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకు ఉద్యోగం మీ కలా? ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 138 పోస్టుల్ని ప్రకటించింది. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.indianbank.in/ వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు.

Indian Bank SO Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు- 138

అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్- 85
మేనేజర్ క్రెడిట్- 15
మేనేజర్ సెక్యూరిటీ- 15


మేనేజర్ ఫారెక్స్- 10మేనేజర్ లీగల్- 2
మేనేజర్ డీలర్- 5
మేనేజర్ రిస్క్ మేనేజ్‌మెంట్- 5
సీనియర్ మేనేజర్ రిస్క్ మేనేజ్‌మెంట్- 1

Indian Bank SO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 10
కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2020 ఫిబ్రవరి 20
ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 మార్చి 8
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ పోస్టుకు 20 నుంచి 30 ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 25 నుంచి 35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టుకు 27 నుంచి 37 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100, ఇతరులకు రూ.600.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 3,10,832 ఉద్యోగాల భర్తీ

Andhra Pradesh Jobs: ఏపీలో 16,208 సచివాలయ ఉద్యోగాలకు సిలబస్ ఇదే

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు