Home /News /jobs /

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అర్హతలివే

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అర్హతలివే

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అర్హతలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అర్హతలివే (ప్రతీకాత్మక చిత్రం)

Army Recruitment Rally | సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించబోతున్నట్టు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీలు, విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోండి.

    ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునేవారి గుడ్ న్యూస్. తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Army Recruitment Rally) నిర్వహించబోతోంది భారతీయ ఆర్మీ. సికింద్రాబాద్‌లో యూనిట్ హెడ్‌క్వార్టర్స్ కోటాలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించబోతున్నట్టు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ర్యాలీ ద్వారా సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్ (ఏఈ), సోల్జర్ ట్రెడ్స్‌మ్యాన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియన్ ఆర్మీ. 2021 నవంబర్ 29 నుంచి 2022 జనవరి 30 వరకు ఈ ర్యాలీ జరగనుంది. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులను బట్టి రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Army Recruitment Rally: భర్తీ చేయనున్న పోస్టులు, విద్యార్హతలు






























    పోస్టు పేరు విద్యార్హతలు వయస్సు
    సోల్జర్ జనరల్ డ్యూటీ టెన్త్ క్లాస్ పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. మొత్తంగా 45 శాతం మార్కులతో పాస్ కావాలి. 17.5 నుంచి 21 ఏళ్లు
    సోల్జర్ టెక్నికల్ (ఏఈ) 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. మొత్తంగా 50 శాతం మార్కులతో పాస్ కావాలి. 17.5 నుంచి 21 ఏళ్లు
    సోల్జర్ ట్రేడ్స్‌మెన్ టెన్త్ క్లాస్ 33 శాతం మార్కులతో పాస్ కావాలి. 17.5 నుంచి 23 ఏళ్లు
    సోల్జర్ Clk/SKT (ఏఓసీ వార్డ్) కేటగిరీ ఏదైనా సబ్జెక్ట్‌లో 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. మొత్తంగా 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్, అకౌంట్స్, బుక్ కీపింగ్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. 17.5 to నుంచి 23 ఏళ్లు

    TCS Jobs: ఆ కోర్సు పాస్ అయినవారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

    Army Recruitment Rally: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ర్యాలీ జరిగే తేదీలు- 2021 నవంబర్ 29 నుంచి 2022 జనవరి 30 వరకు

    స్పోర్ట్స్ కేటగిరీ- ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్‌లోని థపర్ స్టేడియంలో 2021 నవంబర్ 26న ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలి.

    క్రీడార్హతలు- బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ, క్రికెట్ లాంటి క్రీడల్లో రాణించినవారు ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు చేయొచ్చు. రాష్ట్రం తరఫున లేదా దేశం తరఫున జాతీయ, అంతర్జాతీయ కాంపిటీషన్స్‌లో, సీనియర్, జూనియర్ లెవెల్‌లో పాల్గొని ఉండాలి. సర్టిఫికెట్ రెండేళ్ల కన్నా పాతదై ఉండకూడదు.

    IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Army Recruitment Rally: ర్యాలీలో ఎలా పాల్గొనాలంటే...


    ఇండియన్ ఆర్మీ సూచించిన తేదీల్లో అభ్యర్థులు నేరుగా ర్యాలీకి వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ తిరుమలగిరి, ఈస్ట్ మారేడ్‌పల్లిలో హెడ్‌క్వార్టర్స్ ఏఓసీ సెంటర్‌లో రిపోర్ట్ చేయాలి. ఈ ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం airawat0804@nic.in లేదా www.joinindianarmy@nic.in మెయిల్ ఐడీల్లో సంప్రదించాలి.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Army, Army jobs, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Indian Army, JOBS, Secunderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు