ఇండియన్ ఆర్మీ(Army Jobs)లో చేరి దేశ రక్షణలో పాలు పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి 134వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్(Technical Graduate Course (TGC)) లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్ లోని మిలిటరీ అకాడమిలో శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ జనవరి 2022లో ప్రారంభం అవుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు సెప్టెంబర్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నోటిఫికేకషన్ ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం పోస్టులు | 40 |
సివిల్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ | 10 |
ఆర్కిటెక్చర్ విభాగం | 1 |
మెకానికల్ విభాగం | 2 |
ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ | 3 |
కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ | 8 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 3 |
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ | 2 |
టెలీకమ్యూనికేషన్ | 1 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ | 1 |
మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ | 1 |
ఏరోనాటికల్, ఎరోస్పేస్ విభాగం | 1 |
ఏవియానిక్స్ విభాగంలో | 1 |
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ | 2 |
ఫైబర్ ఆప్టిక్స్ | 1 |
ప్రొడక్షన్ | 1 |
ఇండస్ట్రియల్/ మ్యానుఫాక్చరింగ్/ ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్&వర్క్‌షాప్ టెక్నాలజీ విభాగం | 2 |
విద్యార్హతల వివరాలు..
ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఫైనలియర్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో 230 ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి
Indian Army TGC Recruitment 2021: Salary details
ఎంపికైన అభ్యర్థులకే శిక్షణ ఏడాది పాటు ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ ప్రకారం.. ట్రైనీలకు ఏడాది పాటు నెలకు రూ. 56,100 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణలో చేరినప్పటి నుంచే లెఫ్టినెంట్ హోదా ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శాశ్వత కమిషన్ పరిధిలోకి వస్తారు. ఆ సమయంలో రూ.56,100 నుంచి రూ. 1,77,500 వరకు ఉంటుంది. ఇతర అలవెన్స్ లు కూడా ఉంటాయి.
DRDO Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. DRDOలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్
ఎంపిక విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులకు కట్ ఆఫ్ నిర్ణయిస్తారు. కట్ ఆఫ్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. తర్వాత వైద్య పరీక్షలు ఉంటాయి. వీటి ఫలితాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
Indian Army TGC Recruitment 2021: Here’s how to apply
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం ‘Officer Entry Apply/Login’ ఆప్షన్ ను ఎంచుకోవాలి. -తర్వాత ‘Registration’పై క్లిక్ చేయాలి.
Step 3: నిబంధనలు మొత్తం చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
Step 4: రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: వివరాలు మొత్తం నమోదు చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army, Central Government, Defence Ministry, Government jobs, Indian Army