INDIAN ARMY TGC RECRUITMENT 2020 NOTIFICATION RELEASED FOR 132ND TECHNICAL GRADUATE COURSE WITH 40 POSTS SS
Army Jobs: బీటెక్ పాసైనవారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
Army Jobs: బీటెక్ పాసైనవారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)
Indian Army TGC Recruitment 2020 | ఆర్మీలో ఉద్యోగం మీ కలా? బీటెక్ పాసయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. బీటెక్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు తెలుసుకోండి.
బీటెక్ పాసయ్యారా? ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారా? ఇండియన్ ఆర్మీ పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇండియన్ ఆర్మీ 132వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ విడుదలైంది. డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 2021 జనవరిలో వీరిని నియమిస్తారు. పెళ్లికాని యువకులు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మొత్తం 40 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 28న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://joinindianarmy.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
Indian Army TGC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 40
సివిల్ ఇంజనీరింగ్- 10
ఆర్కిటెక్చర్- 01
మెకానికల్ ఇంజనీరింగ్- 03
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 4
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఇన్ఫోటెక్ / ఎంఎస్సీ కంప్యూటర్- 09
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ / టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / శాటిలైట్ కమ్యూనికేషన్- 06
ఏరోనాటికల్ / ఏవియానిక్స్- 02
ఏరోస్పేస్- 01
న్యూక్లియర్ టెక్నాలజీ- 01
ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 01
లేజర్ టెక్నాలజీ- 01
ఇండస్ట్రియల్ / మ్యానిఫ్యాక్చరింగ్- 01
Indian Army TGC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 26
విద్యార్హతలు- ఇంజనీరింగ్ డిగ్రీ
వయస్సు- 20 నుంచి 27 ఏళ్లు
Indian Army TGC Recruitment 2020: అప్లై చేయండి ఇలా
ముందుగా https://joinindianarmy.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి
Officers Entry Login ట్యాబ్ పైన క్లిక్ చేయండి
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ట్యాబ్ క్లిక్ చేయండి
అన్ని వివరాలు ఎంటర్ చేయండి
మీ ఫోటో, సంతకం అప్లోడ్ చేయండి
దరఖాస్తులోని వివరాలన్నీ ఓసారి సరిచూసుకోండి
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.