ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 44 నోటిఫికేషన్ విడుదల చేసింది. 10+2 పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇండియన్ ఆర్మీ ప్రతీ ఏటా 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నియామకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఏడాదికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది.
ఉద్యోగులకు శుభవార్త... గ్రాట్యూటీకి కొత్త రూల్ వచ్చేస్తోంది
Railway Jobs: మొత్తం 5285 ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్... క్లారిటీ ఇచ్చిన రైల్వే
మొత్తం ఖాళీలు- 90
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 9
పరీక్ష తేదీ- త్వరలో వెల్లడించనున్న ఇండియన్ ఆర్మీ
విద్యార్హత- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 పాస్ కావాలి. కనీసం 70% మార్కులు ఉండాలి.
వయస్సు- 16 ఏళ్ల 6 నెలల నుంచి 19 ఏళ్ల 6 నెలలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army, CAREER, Exams, Indian Army, Job notification, JOBS, NOTIFICATION