• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN ARMY RELEASED TES 45 RECRUITMENT 2021 JULY SESSION NOTIFICATION KNOW HOW TO APPLY SS

Indian Army Jobs 2021: ఇంటర్ పాస్ అయినవారికి ఇండియన్ ఆర్మీలో జాబ్స్

Indian Army Jobs 2021: ఇంటర్ పాస్ అయినవారికి ఇండియన్ ఆర్మీలో జాబ్స్

Indian Army Jobs 2021: ఇంటర్ పాస్ అయినవారికి ఇండియన్ ఆర్మీలో జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Indian Army TES 45 Recruitment 2021 | ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇంటర్ పాస్ అయినవారికి శుభవార్త. ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-TES 45 నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏటా టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-TES ద్వారా పలు ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది ఇండియన్ ఆర్మీ. గతేడాది ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేసింది. ఇప్పుడు జూలై సెషన్ నోటిఫికేషన్ ద్వారా 90 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 21 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఇదే వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. పెళ్లికాని యువకులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

    SSC MTS Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్... అప్లై చేయండి ఇలా

    HCL Recruitment Drive: విజయవాడలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 1000 ఉద్యోగాలు... రిక్రూట్‌మెంట్ డ్రైవ్ వివరాలివే

    Indian Army TES 45 Recruitment 2021: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 90
    దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 1
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 21
    విద్యార్హత- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 పాస్ కావాలి. కనీసం 70% మార్కులు ఉండాలి.
    వయస్సు- 16 ఏళ్ల 6 నెలల నుంచి 19 ఏళ్ల 6 నెలలు.
    శిక్షణా కాలం- 5 ఏళ్లు. ఫైనల్ ఎగ్జామ్ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ లభిస్తుంది.

    SSC MTS Recruitment 2021: పదవ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ వచ్చేసింది

    NYKS Recruitment 2021: 10వ తరగతి పాస్ అయినవారికి 13,206 ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు

    Indian Army TES 45 Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    ఆ తర్వాత Online Application పైన క్లిక్ చేయాలి.
    రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
    అభ్యర్థుల వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
    సేవ్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
    విద్యార్హతల వివరాలు, ఇతర డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
    దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ కోసం సెలక్షన్ సెంటర్‌కు దరఖాస్తు ఫామ్ తీసుకెళ్లాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు