Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఇంటర్, ఇంజనీరింగ్ అర్హత

Indian Army Recruitment 2019 | ఆసక్తి గల అభ్యర్థులు http://joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. యువకులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి.

news18-telugu
Updated: October 23, 2019, 12:38 PM IST
Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఇంటర్, ఇంజనీరింగ్ అర్హత
Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఇంటర్, ఇంజనీరింగ్ అర్హత (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 23, 2019, 12:38 PM IST
ఆర్మీలో ఉద్యోగం చేయాలని కలలు కనే యువకులకు శుభవార్త. పలు ఉద్యోగాలకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసింది. 131వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్- TGC ద్వారా 40 పోస్టుల్ని, 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్-TES ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియన్ ఆర్మీ. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్‌కు నవంబర్ 13, టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్‌కు నవంబర్ 14 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు http://joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. యువకులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Army TGC 131 Notification: ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ నోటిఫికేషన్ వివరాలు


మొత్తం ఖాళీలు- 40

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 14
విద్యార్హత- సివిల్ / ఆర్కిటెక్చర్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికామ్ / టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఏరోనాటికల్ / బాలిస్టిక్స్ / ఏవియానిక్స్‌లో ఎంఎస్సీ పాస్ కావాలి. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు.


వయస్సు- 20 నుంచి 27 ఏళ్లు
Loading...

Indian Army TES 43 Notification: ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ వివరాలు


మొత్తం ఖాళీలు- 90
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 13
విద్యార్హత- 10+2 పరీక్ష పాసైన విద్యార్థులు అప్లై చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 70% మార్కులు ఉండాలి.
వయస్సు- 16.5 నుంచి 19.5 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్‌లో 5,476 జాబ్స్... అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి

SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు... నోటిఫికేషన్ వివరాలివే

Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే
First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...