ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్ న్యూస్. పలు ఖాళీల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ కోర్స్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పెళ్లికాని యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 జూన్ 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://joinindianarmy.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఎంపికైన వారికి తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ కోర్స్- 14
సివిల్ / బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ- 5
మెకానికల్- 1
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 1
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 4
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 2
ఏరోనాటికల్ / ఏరోస్పేస్ / ఏవియానిక్స్ - 1
డిఫెన్స్ సిబ్బంది వితంతువులు- 2
Indian Army SSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 మే 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 23
విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు. 2021 అక్టోబర్ 1 లోపు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- 20 నుంచి 27 ఏళ్లు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.