Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... వివరాలివే

Indian Army Recruitment Rally | బాక్సింగ్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ లాంటి క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చినవాళ్లు సర్టిఫికెట్లతో సహా స్పోర్ట్స్ ట్రయల్‌కు హాజరు కావచ్చు.

news18-telugu
Updated: October 17, 2019, 4:14 PM IST
Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... వివరాలివే
Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 17, 2019, 4:14 PM IST
ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా? ఆర్మీ జాబ్ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారా? సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగబోతోంది. సోల్జర్ క్లర్క్(SKT), సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ (ఓపెన్ కేటగిరీ), మ్యుజీషియన్ (ఓపెన్ కేటగిరీ) పోస్టులకు 2019 డిసెంబర్ 2 నుంచి 2020 జనవరి 19 వరకు ఎన్‌రోల్‌మెంట్ జరగనుంది. ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ (ఓపెన్ కేటగిరీ) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 2019 నవంబర్ 29న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లో ఉదయం 8 గంటలకు స్పోర్ట్స్ ట్రయల్ కోసం రిపోర్ట్ చేయాలి. బాక్సింగ్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ లాంటి క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చినవాళ్లు సర్టిఫికెట్లతో సహా స్పోర్ట్స్ ట్రయల్‌కు హాజరు కావచ్చు. మిలిటరీ బ్యాండ్‌లో మ్యుజీషియన్ (ఓపెన్ కేటగిరీ) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 2019 డిసెంబర్ 2న ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేయాలి. స్పోర్ట్స్‌మెన్ అభ్యర్థుల వయస్సు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్లు, మ్యూజీషియన్స్ అభ్యర్థుల వయస్సు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం Headquarters, AOC Centre, East Marredpally, Tirumalagiri, Secunderabad-15 అడ్రస్‌లో సంప్రదించాలి. లేదా airawat0804@nic.in ఐడీకి మెయిల్ చేయాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు
Loading...
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 327 ఖాళీలు
First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...