INDIAN ARMY RECRUITMENT FOR 10TH PASS VACANCIES FOR TRADESMAN WASHERMAN HERE DETAILS NS GH
Army Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో ఆర్మీ జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ ఆర్మీ (Indian Army) కి చెందిన సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వాషర్మెన్, ట్రేడ్స్మెన్మేట్ల పోస్టులకు సంబంధించి మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనుంది.
ఇండియన్ ఆర్మీ (Indian Army) కి చెందిన సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వాషర్మెన్, ట్రేడ్స్మెన్మేట్ల పోస్టులకు (Jobs) సంబంధించి మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన 45 రోజులలోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తును ఇంగ్లీష్/హిందీలో సబ్మిట్ చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు హెడ్ క్వార్టర్స్ సదరన్ కమాండ్‌లోని ఏదైనా AMC యూనిట్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు.
ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్ట్ (Age Limit):
గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో పాసై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్లలో ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్.. నేరుగా వాక్ ఇన్ ద్వారా ఎంపిక.. అర్హతల వివరాలు
దరఖాస్తు విధానం: స్టెప్-1:ప్రతి దరఖాస్తుదారుడు ఒక్కో పోస్ట్‌కి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
స్టెప్-2:రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
స్టెప్-3:కమాండెంట్, మిలిటరీ హాస్పిటల్, డిఫెన్స్ కాలనీ రోడ్, చెన్నై, తమిళనాడు, పిన్: 600032 అనే చిరునామాకు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
స్టెప్-4:అభ్యర్థులు ఎన్వలప్ పైన, క్యాపిటల్ లెటర్స్‌లో కేటగిరీ విభాగంలతో ఏ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారో స్పష్టంగా తెలియజేయాలి.
స్టెప్-5:రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు కూడా ఎన్వలప్ ఎడమ వైపు మూలలో వారి కేటగిరీని పేర్కొనాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు
అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రశ్నాపత్రం హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో ఉంటుంది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇంగ్లీషులో మాత్రమే ఉంటాయి. ఈ పరీక్షలో 10వ తరగతికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండే అవకాశం ఉంది.
మరోవైపు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) వివిధ విభాగాల్లో 58 సైంటిస్టుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీఆర్డీవో రిక్రూట్మెంట్ & అసెస్మెంట్ సెంటర్ (RAC) అధికారిక వెబ్సైట్ rac.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీని జూన్ 28గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులు DRDO అవసరాలను బట్టి రిమోట్, ఫీల్డ్ లొకేషన్లలో దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలను అందించాల్సి ఉంటుంది.
రిక్రూట్మెంట్ కోసం స్క్రీనింగ్ కమిటీ పేర్కొన్న విద్యార్హత, వర్క్ ఎక్స్ పీరియన్స్, ఇతర ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. ఆ తరువాత ప్రిలిమినరీ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆపై ఒక పోస్ట్‌కు 12 మంది అభ్యర్థులు అంటే 1:12 నిష్పత్తిలో ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.