INDIAN ARMY RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR ARMY RECRUITMENT RALLY IN HAKIMPET TELANGANA SS
Army Recruitment Rally 2021: తెలంగాణలోని హకీంపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Army Recruitment Rally 2021: తెలంగాణలోని హకీంపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
(ప్రతీకాత్మక చిత్రం)
Hakimpet Army Recruitment Rally 2021 | ఆర్మీలో ఉద్యోగం మీ కలా? ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనాలనుకుంటున్నారా? మీకు మరో అవకాశం రాబోతోంది. హకీంపేటలో జరిగే రిక్రూట్మెంట్ ర్యాలీ వివరాలు తెలుసుకోండి.
తెలంగాణలోని హకీంపేటలో ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించబోతోంది. 2021 జనవరి 18 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్లో యూనిట్ హెడ్‌క్వార్డర్స్‌లో మరో ర్యాలీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో 2021 మార్చి 5 నుంచి మార్చి 24 వరకు ఈ ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్‌లో ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 జనవరి 19న ప్రారంభం అవుతుంది. 2021 ఫిబ్రవరి 17 చివరి తేదీ. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు ఎన్రోల్ చేయొచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఆర్మీ.
రిక్రూట్మెంట్ తేదీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లాంటి వివరాలన్నీ అడ్మిట్ కార్డులో ఉంటాయి. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని రద్దీని తగ్గించేందుకు నాలుగు రిపోర్ట్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది ఇండియన్ ఆర్మీ. ఈ రిపోర్ట్ సెంటర్లన్నీ హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌కు దగ్గర్లోనే ఉంటాయి. ప్రతీ రోజు 500 మందిని బ్యాచ్‌ల వారీగా ర్యాలీకి అనుమతి ఇస్తారు. అభ్యర్థులకు టోకెన్లు జారీ చేస్తారు. అభ్యర్థులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసులో లేదా 040-27740059, 27740205 ఫోన్ నెంబర్లను సంబంధించి రిపోర్టింగ్ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
Army Recruitment Rally 2021: హకీంపేట రిక్రూట్మెంట్ ర్యాలీ వివరాలు ఇవే
రిజిస్ట్రేషన్- 2021 జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17
అడ్మిట్ కార్డుల విడుదల- 2021 ఫిబ్రవరి 18
ర్యాలీ జరిగే తేదీలు- 2021 మార్చి 5 నుంచి మార్చి 24
భర్తీ చేసే పోస్టులు- సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్, అమ్యూనిషన్ ఎగ్జామినర్), సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ పాసైనవారు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
జిల్లాలు- ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులంబా గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబుబ్‌నగర్, మెదక్, మహబూబాబాద్, మంచిర్యాల్, మేడ్చల్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.