Army Jobs: ఆర్మీలో ఉద్యోగాలు... టెన్త్ పాసైన అమ్మాయిలకు మాత్రమే

Indian Army Recruitment 2020 | ఇండియన్ ఆర్మీలో అమ్మాయిలకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. టెన్త్ పాసైన అమ్మాయిల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇండియన్ ఆర్మీ.

news18-telugu
Updated: July 31, 2020, 4:07 PM IST
Army Jobs: ఆర్మీలో ఉద్యోగాలు... టెన్త్ పాసైన అమ్మాయిలకు మాత్రమే
Army Jobs: ఆర్మీలో ఉద్యోగాలు... టెన్త్ పాసైన అమ్మాయిలకు మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. సోల్జర్ జనరల్ డ్యూటీ (వుమెన్ మిలిటరీ పోలీస్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఆర్మీ. మొత్తం 99 పోస్టులున్నాయి. ఈ పోస్టులు అమ్మాయిలకు మాత్రమే. టెన్త్ పాసైన అమ్మాయిలు సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 27న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 21 చివరి తేదీ. బెంగళూరు, అంబాలా, లక్నో, జబల్‌పూర్, షిల్లాంగ్, పూణెలో రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించనుంది ఇండియన్ ఆర్మీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 26,778 ఉద్యోగాలు... వారం రోజుల్లోనే భర్తీ

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 ఉద్యోగాలు... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీలు

Indian Army Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


మొత్తం సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులు- 99
దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 21విద్యార్హత- మెట్రిక్యులేషన్ / 10వ తరగతి / ఎస్ఎస్‌ఎల్‌సీ 45 శాతం మార్కులతో పాస్ కావాలి.
వయస్సు- 17.5 నుంచి 21 ఏళ్లు (1999 అక్టోబర్ 1 నుంచి 2003 నుంచి ఏప్రిల్ 1 మధ్య జన్మించినవారై ఉండాలి)
ఫిజికల్ రిక్వైర్‌మెంట్స్- ఎత్తు 152 సెంటీమీటర్లు.
Published by: Santhosh Kumar S
First published: July 31, 2020, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading