Indian Army: బీటెక్ పాసైనవారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Indian Army: బీటెక్ పాసైనవారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Indian Army Recruitment 2020 | భారతీయ ఆర్మీలో ఉద్యోగం మీ కలా? జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    బీటెక్ పాసైనవారికి శుభవార్త. ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నాలజీ) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 56వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నాలజీ) మెన్ ఏప్రిల్ 2021 నోటిఫికేషన్‌తో పాటు 27వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నాలజీ) వుమెన్ ఏప్రిల్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. పెళ్లికాని పురుషులు, మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారికి తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 2021 ఏప్రిల్ 1 నుంచి కోర్సు ప్రారంభం అవుతుంది. పురుషులకు 175 ఖాళీలు, మహిళలకు 14 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 2020 అక్టోబర్ 14 నవంబర్ 12 వరకు అప్లై చేయొచ్చు.

    IOCL Recruitment 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    SSC Recruitment 2020: డిప్లొమా, బీటెక్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

    Indian Army Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 189

    పురుషులు- 175
    సివిల్- 49
    ఆర్కిటెక్చర్- 1
    బిల్డింగ్ కన్‌స్ట్రక్చన్ టెక్నాలజీ- 1
    మెకానికల్- 15
    ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 16
    కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 47
    ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్- 21
    ఎలక్ట్రానిక్స్- 3
    మైక్రో ఎలక్ట్రానిక్స్- 3
    ఏరోనాటికల్- 5
    ఏవియానిక్స్- 5
    ఏరోస్పేస్- 1
    ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 2
    ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 2
    ఇన్‌స్ట్రుమెంటేషన్- 2
    టెక్స్‌టైల్- 1
    ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్- 1

    మహిళలు- 14
    సివిల్- 3
    ఆర్కిటెక్చర్, బిల్డింగ్ కన్‌స్ట్రక్చన్ టెక్నాలజీ- 1
    మెకానికల్- 1
    ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 2
    ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్- 2
    కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 4
    ఏరోనాటికల్- 1

    BSF Recruitment 2020: బీఎస్ఎఫ్‌లో 228 కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు... ఖాళీల వివరాలివే

    MIDHANI Recruitment 2020: హైదరాబాద్ మిధానిలో 158 జాబ్స్... చివరి తేదీ ఎప్పుడంటే

    Indian Army Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 10
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 12
    విద్యార్హతలు- ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు పూర్తి చేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు.
    వయస్సు- 20 నుంచి 27 ఏళ్లు.
    Published by:Santhosh Kumar S
    First published: