Indian Army Jobs: టెన్త్ పాసైతే చాలు... ఆర్మీలో ఉద్యోగాలు... అమ్మాయిలకు మాత్రమే

Indian Army Recruitment 2019 | నోటిఫికేషన్ ప్రకారం అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెంగళూరు, షిల్లాంగ్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీ, స్థలం వివరాలు అడ్మిట్ కార్డులో వెల్లడిస్తారు.

news18-telugu
Updated: April 25, 2019, 3:08 PM IST
Indian Army Jobs: టెన్త్ పాసైతే చాలు... ఆర్మీలో ఉద్యోగాలు... అమ్మాయిలకు మాత్రమే
Indian Army Jobs: టెన్త్ పాసైతే చాలు... ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... అమ్మాయిలకు మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం, image: Reuters)
news18-telugu
Updated: April 25, 2019, 3:08 PM IST
ఇండియన్ ఆర్మీలో సోల్జర్ జెనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 100 సోల్జర్ జెనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్) పోస్టులున్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25న ప్రారంభమైంది. జూన్ 8న ముగుస్తుంది. ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in లో వివరాలు తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెంగళూరు, షిల్లాంగ్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీ, స్థలం వివరాలు అడ్మిట్ కార్డులో వెల్లడిస్తారు.


Indian Army Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...




సోల్జర్ జెనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్)- మొత్తం 100 పోస్టులు
Loading...
మెట్రిక్యులేషన్ / టెన్త్ / ఎస్ఎస్ఎల్‌సీ 45 శాతం మార్కులతో పాస్ కావాలి.
వయస్సు: 17 నుంచి 21 ఏళ్లు. (01 అక్టోబర్ 1998 నుంచి 01 ఏప్రిల్ 2002 మధ్య పుట్టినవాళ్లు)
ఫిజికల్ స్టాండర్డ్: 1.6 కిలోమీటర్ల రన్నింగ్‌ను 7.30 నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 అడుగుల లాంగ్ జంప్, 3 అడుగుల హై జంప్.
ఎత్తు 142 సెంటిమీటర్లు ఉండాలి. ఎత్తు, వయస్సుకు తగ్గ బరువు ఉండాలి.
అభ్యర్థులు కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(CEE) రాయాల్సి ఉంటుంది.
మెడికల్‌గా ఫిట్‌నెస్‌తో ఉన్నవారినే రాతపరీక్షకు అనుమతిస్తారు.
సోల్జర్ జెనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:

JIO New Plans: జియో ప్లాన్స్ ధరలు తగ్గాయి... రూ.149 ప్లాన్‌తో 42 జీబీ డేటా

Jio Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ జియో యాప్స్ ఉన్నాయా? ఉపయోగాలు తెలుసుకోండి

RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ
First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...