హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Army Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు... రూ.1,77,500 వరకు జీతం

Army Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు... రూ.1,77,500 వరకు జీతం

Army Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు... రూ.1,77,500 వరకు జీతం
(ప్రతీకాత్మక చిత్రం)

Army Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు... రూ.1,77,500 వరకు జీతం (ప్రతీకాత్మక చిత్రం)

Indian Army Officer Recruitment 2021 | ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. టెరిటోరియల్ ఆర్మీలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే జూలై 20న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jointerritorialarmy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు ఈ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారిని లెఫ్టనెంట్ ర్యాంకులో నియమిస్తారు.

Indian Army Officer Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 20

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 19

పరీక్ష తేదీ- 2021 సెప్టెంబర్ 26

BDL Recruitment 2021: హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్

Indian Navy Jobs 2021: నేవీలో 350 పోస్టులకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ

Indian Army Officer Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

వయస్సు- 18 నుంచి 42 ఏళ్లు

దరఖాస్తు ఫీజు- రూ.200

ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ పరీక్షలు, మెడికల్ టెస్ట్

పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, పూణె, కోల్‌కతా, డార్జిలింగ్, గువాహతి, దిమాపూర్, చండీగఢ్, జలంధర్, షిమ్లా, ఢిల్లీ, అంబాలా, హిసర్, లక్నో, అలాహాబాద్, ఆగ్రా, భువనేశ్వర్, డెహ్రడూన్, ఉదంపూర్, శ్రీనగర్, నగ్రోటా

వేతనం- రూ.1,77,500 వరకు

High Court Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్టులో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో జాబ్స్... పరీక్ష లేదు... విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు

Indian Army Officer Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ https://www.jointerritorialarmy.gov.in/ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో Careers పైన క్లిక్ చేయాలి.

Join As An Officer పైన క్లిక్ చేయాలి.

Register పైన క్లిక్ చేయాలి.

పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లాంటి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి.

రిజిస్ట్రేషన్ సమయంలో సొంత ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తప్పనిసరి.

అన్ని వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేయాలి.

యూజర్ నేమ్, పాస్‌వర్డ్ గుర్తుంచుకోవాలి.

యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

లాగిన్ చేసిన తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

First published:

Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

ఉత్తమ కథలు