INDIAN ARMY KEY DECISION 50 PERCENT OF SOLDIERS LIKELY TO RETIRE WITHIN FIVE YEARS OF RECRUITMENT FULL DETAILS HERE GH VB
Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. కానీ.. 5 ఏళ్ల లోపే పదవీ విరమణ..! వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకోనుంది. పెరుగుతున్న రక్షణ శాఖ పెన్షన్ బిల్లులు, సైన్యంలో అధికారుల కొరతను తగ్గించాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ మోడల్‌పై అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ ఆర్మీ(Indian Army) కీలక నిర్ణయం(Key Decision) తీసుకోనుంది. పెరుగుతున్న రక్షణ శాఖ(Defense) పెన్షన్ బిల్లులు, సైన్యంలో అధికారుల కొరతను తగ్గించాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ మోడల్‌పై(Recruitment Model) అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2020లో ప్రతిపాదించిన ఈ మోడల్.. స్వల్పకాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైనికులను రిక్రూట్(Recruit) చేయాలని ప్రతిపాదించింది. 2020లో కోవిడ్-19 విజృంభించిన తర్వాత ఆర్మీ సైనికుల నియామక ప్రక్రియను ఆపేశారు. ఈ నేపథ్యంలో రక్షణ దళాలలో చేరాలని చూస్తున్న అభ్యర్థులు రిక్రూట్మెంట్ ర్యాలీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో టూర్ ఆఫ్ డ్యూటీ (ToD) అనే ప్రతిపాదిత రిక్రూట్మెంట్ మోడల్ చివరి దశలో ఉందని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు News18కి తెలిపాయి. గత రెండు వారాలుగా దీనిపై అనేక సమావేశాలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ స్కీమ్ డ్రాఫ్ట్ ప్రకారం.. భారత సైన్యంలోని సైనికులందరినీ టూర్ ఆఫ్ డ్యూటీ మోడల్ కింద నియమించుకుంటారు. వీరిలో 25% మంది ఆర్మీలో మూడేళ్లపాటు, 25% మంది సైనికులు ఐదేళ్లపాటు సేవలందిస్తారు. మిగిలిన 50% మంది పదవీ విరమణ వయసు వచ్చే వరకు పూర్తి కాలానికి ఆర్మీలో కొనసాగుతారని సోర్సెస్ వెల్లడించాయి. దీనివల్ల రక్షణ శాఖ పెన్షన్ బిల్లులు గణనీయంగా తగ్గనున్నాయి.
మూడు, ఐదు సంవత్సరాల తర్వాత రిలీవ్ అయ్యే 50% మంది సైనికులను జాతీయ పెన్షన్ పథకంలో చేరుస్తారు. దీంతోపాటు నిర్ణీత కాలానికి సాయుధ దళాలకు వర్తించే వైద్య ప్రయోజనాలను అందించాలని కూడా ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదిత రిక్రూట్మెంట్ మోడల్ అధికారులకు వర్తించకపోవచ్చు. కిందిస్థాయి సైనికులను మాత్రమే ఈ విధానంలో నియమించుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్లో పార్లమెంట్లో సమర్పించిన సమాచారం ప్రకారం సైన్యంలో 7,476 మంది అధికారుల కొరత ఉంది. ఈ ప్రతిపాదనపై రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం సైన్యం వేచి చూస్తోంది. తాజా ప్రతిపాదనను ఎప్పటినుంచి ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది.
న్యూస్ 18 సేకరించిన తాజా డేటా ప్రకారం.. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రిక్రూట్మెంట్ ర్యాలీలు ఆపేసిన గత రెండేళ్లలో 1.1 లక్షల వరకు సైనికుల ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రతి నెలా సుమారు 5,000 ఖాళీలు ఏర్పడుతున్నాయి.
ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి..
ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలలో భారత సైన్యం ఒకేసారి 40,000 మంది రిక్రూట్లకు శిక్షణ ఇవ్వగలదు. ప్రతి సంవత్సరం 60,000 మంది సైనికులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇలా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రస్తుత మౌలిక సదుపాయాలు సరిపోతాయి. సాధారణ డ్యూటీ సైనికులకు శిక్షణ వ్యవధి 34 వారాలు కాగా, ట్రేడ్స్‌మెన్‌కు 19 వారాలుగా ఉంది. అయితే తాజా మోడల్ ప్రకారం రిక్రూట్లను వెంటనే పెంచినప్పటికీ, ఈ ఖాళీలన్నింటినీ భర్తీ చేయడానికి ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది. ToD అమలయ్యి.. కొత్త రిక్రూట్మెంట్లకు ప్రాథమిక సైనిక శిక్షణను 19 వారాలకు కుదిస్తే, గత రెండేళ్లలో పెరిగిన సైనికుల కొరతను తీర్చడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పడుతుందని మరో అధికారి న్యూస్18కు తెలిపారు.
కానీ ఇదే సమయంలో మూడు, ఐదు సంవత్సరాల చివర్లో ToD ద్వారా పదవీ విరమణ చేసే వారి స్థానంలో ఖాళీలు ఏర్పడతాయి. అందువల్ల అదనపు రిక్రూట్మెంట్లకు శిక్షణ ఇవ్వడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సి ఉంటుంది. అయితే ఈ పథకాన్ని అమలు చేసిన తేదీ నుంచి అందుకు ఆర్మీకి మూడు సంవత్సరాల సమయం ఉంటుంది. ఆ తర్వాత పెరిగే ఖాళీలను ToD కింద భర్తీ చేయడానికి విస్తృతమైన మౌలిక సదుపాయాలు అవసరమని రెండో అధికారి తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.