ఇండియన్ ఆర్మీ (Indian Army) కి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ (ఓటీఏ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 2022 అక్టోబర్ సంవత్సరానికి 59వ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్, అంతే కాకుండా 30వ షార్ట్ సర్వీస్ (టెక్) ఉమెన్ కోర్సు నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టులను ఇంజనీరింగ్ చదివిన మహిళలు, పురుషులు అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ఆసకపద్ధతిలో ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ట వయసు 27 ఏళ్లు మించి ఉండకూడదు. నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in/officers-notifications.htm ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఏప్రిల్ 6, 2022 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
ఎస్ఎస్‌సీ టెక్ (మెన్) | సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించి ఉండకూడదు. | 174 |
ఎస్ఎస్‌సీ టెక్ (వుమెన్) | సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించి ఉండకూడదు. | 14 |
విడోస్ డిఫెన్స్ పర్సనల్ | సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ లేదా నాన్ టెక్నికల్ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు. | 02 |
ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in/default.aspx ను సందర్శించాలి.
Step 3 - నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలి.
Step 4 - అనంతరం Officers Entry Apply / Login లింక్‌పై క్లిక్ చేయాలి.
Step 5 - తరువాత New Registration విభాగానికి వెళ్లి Registration పై క్లిక్ చేయాలి.
Step 6 - ఆధార్ నంబర్, ఈమెయిల్, పుట్టిన తేది వంటి సమాచారంతో దరఖాస్తు ఫాం ప్రారంభించాలి.
Step 7 - దరఖాస్తు పూర్తయిన తరువాత సబ్‌మిట్ చేయాలి.
Step 8 - దరఖాస్తుకు ఏప్రిల్ 6, 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army jobs, Central Government Jobs, Govt Jobs 2022, Indian Army