భారతీయ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. పలు ఖాళీల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్జ్ అడ్వకేట్ జనరల్-JAG బ్రాంచ్‌లో ఎంట్రీ స్కీమ్ 27వ కోర్స్ అక్టోబర్ 2021 కోసం నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ ఆర్మీ. లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పెళ్లికాని యువతీయువకులు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఎంపికైనవారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ప్రీ-కమిషన్ ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ స్ట్రాటజిక్ స్టడీస్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఆ తర్వాత ఎంపికైనవారు 14 ఏళ్లు రెగ్యులర్ ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మొదట 10 ఏళ్లు, ఆ తర్వాత 4 ఏళ్లు పొడిగిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూన్ 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారతీయ ఆర్మీకి చెందిన రిక్రూట్మెంట్ వెబ్సైట్ http://www.joinindianarmy.nic.in/ లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 8
యువకులు- 6
యువతులు- 2
Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలు... రేపటి నుంచి ఇంటర్వ్యూలు
RITES Recruitment 2021: రైల్వే సంస్థలో 146 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 4
విద్యార్హతలు- ఎల్ఎల్బీ డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ తర్వాత మూడేళ్ల లా లేదా ఇంటర్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు చేసినవారు అప్లై చేయొచ్చు. కనీసం 55 శాతం మార్కులతో పాస్ కావాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్‌లో అడ్వకేట్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయస్సు- 21 నుంచి 27 ఏళ్లు
స్టైపెండ్- రూ.56,100 వరకు
MES Recruitment 2021: మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో 572 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు
SBI Clerk Jobs 2021: ఎస్బీఐలో 5454 క్లర్క్ జాబ్స్... అప్లై చేయండి ఇలా
అభ్యర్థులు ముందుగా http://www.joinindianarmy.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Officer Entry Apply/Login పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Registration లింక్ పైన క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి.
రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో ఇతర వివరాలు ఎంటర్ చేసి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Indian Army, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs