• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • INDIAN ARMY INVITES APPLICATIONS FOR 55 POSTS UNDER NCC SPECIAL ENTRY SCHEME KNOW HOW TO APPLY SS

Indian Army Recruitment 2021: డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Indian Army Recruitment 2021: డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Indian Army Recruitment 2021 | భారతీయ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఖాళీల వివరాలతో పాటు నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 50వ కోర్స్ (అక్టోబర్ 2021) కోర్స్ కోసం ఇండియన్ ఆర్మీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 55 ఖాళీలను భర్తీ చేస్తోంది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్-NCC విద్యార్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. పెళ్లికాని యువతీయువకులకే అవకాశం. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 జూలై 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఎంపికైన తర్వాత చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది.

    Indian Army Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 55
    ఎన్‌సీసీ మెన్- 50 (జనరల్ కేటగిరీ-45, వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్-5)
    ఎన్‌సీసీ వుమెన్- 5 (జనరల్ కేటగిరీ-4, వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్-1)

    SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు

    BIS Recruitment 2021: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

    Indian Army Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 16
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 15
    విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు. 2021 అక్టోబర్ 1 నాటికి డిగ్రీ పాస్ అయినట్టు తర్వాత సర్టిఫికెట్ సమర్పించాలి.
    ఇతర అర్హతలు- అభ్యర్థులు ఎన్‌సీసీలో రెండుమూడేళ్లు సీనియర్ డివిజన్, సీనియర్ వింగ్‌లో పనిచేసి ఉండాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో బీ గ్రేడ్‌లో పాస్ కావాలి.
    వయస్సు- 2021 జూలై 1 నాటికి 19 నుంచి 25 ఏళ్లు ఉండాలి. 1996 జూలై 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారు అప్లై చేయొచ్చు.
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్.

    Railway Jobs 2021: భారతీయ రైల్వేలో 3591 ఉద్యోగాలు... అప్లై చేయడానికి 2 రోజులే గడువు

    Govt Jobs after 10th: రైల్వే నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు... టెన్త్ పాస్ అయినవారికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు

    Indian Army Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
    అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు.
    Officer Entry Appln/Login పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత Registration పైన క్లిక్ చేయాలి.
    నియమనిబంధనలన్నీ చదవాలి.
    ఆ తర్వాత Continue పైన క్లిక్ చేయాలి.
    పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్టర్ చేయాలి.
    దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: