Indian Army SSC Recruitment 2020: ఆర్మీలో 191 ఉద్యోగాలు... పెళ్లికాని యువతీయువకులకు అవకాశం

Indian Army SSC Recruitment 2020 | ఎంపికైన వారికి తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: January 24, 2020, 3:23 PM IST
Indian Army SSC Recruitment 2020: ఆర్మీలో 191 ఉద్యోగాలు... పెళ్లికాని యువతీయువకులకు అవకాశం
Indian Army SSC Recruitment 2020: ఆర్మీలో 191 ఉద్యోగాలు... పెళ్లికాని యువతీయువకులకు అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు వచ్చాయి. 55వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్ (అక్టోబర్ 2020), 26వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ కోర్స్ (అక్టోబర్ 2020) నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పెళ్లికాని యువతీయువకులు, డిఫెన్స్ సిబ్బంది వితంతువులు ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 22న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 20 చివరి తేదీ. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైన వారికి తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Indian Army SSC Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 191

55వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్ (అక్టోబర్ 2020)- 175
సివిల్- 42
మెకానికల్- 14


ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 17కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 58
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ / టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / శాటిలైట్ కమ్యూనికేషన్- 21
ఎలక్ట్రానిక్స్- 2
ఆప్టో ఎలక్ట్రానిక్స్- 2
ఫైబర్ ఆప్టిక్స్- 2
మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్- 2
ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 2
ఆర్కిటెక్చర్- 3
బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ- 2
ఏరోనాటికల్- 2
బాలిస్టిక్స్- 2
ఏవియానిక్స్- 2
ఏరోస్పేస్- 2

26వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ కోర్స్ (అక్టోబర్ 2020)- 14
ఆర్కిటెక్చర్ / బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ- 1
మెకానికల్- 2
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 2
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ / టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / శాటిలైట్ కమ్యూనికేషన్- 3
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 3

డిఫెన్స్ సిబ్బంది వితంతువులు- 2
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

ESI Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 81 ఉద్యోగాలు... ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్వ్యూలు

Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 జాబ్స్... ఖాళీల వివరాలివే

Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు