Indian Army Jobs: టెన్త్ పాస్ అయిన యువతులకు ఆర్మీలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

Indian Army Jobs: టెన్త్ పాస్ అయిన యువతులకు ఆర్మీలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Indian Army Recruitment 2021 | టెన్త్ పాస్ అయిన యువతులకు గుడ్ న్యూస్. ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునే అమ్మాయిలకు గుడ్ న్యూస్. వుమెన్ మిలిటరీ పోలీస్‌లో సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాస్ అయిన అమ్మాయిలు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ పోస్టుల్ని భర్తీ చేసేందుకు అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెల్గామ్, పూణె, షిల్లాంగ్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీ వివరాలు అభ్యర్థుల ఇ-మెయిల్‌కు వస్తాయి. అడ్మిట్ కార్డులో ఉన్న తేదీకి ర్యాలీ జరిగే ప్రాంతానికి చేరుకోవాలి.

    India Post GDS Results 2021: తెలంగాణ, ఏపీ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల ఫలితాలపై ఇండియా పోస్ట్ క్లారిటీ

    UGC Recruitment 2021: నెలకు రూ.50,000 వేతనంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో ఉద్యోగాలు

    Indian Army Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    మొత్తం సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులు- 100
    దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 6
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 21
    విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి.
    వయస్సు- 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు (2000 అక్టోబర్ 1 నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయొచ్చు)
    ఎంపిక విధానం- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్
    ర్యాలీ జరిగే ప్రాంతాలు- అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెల్గామ్, పూణె, షిల్లాంగ్‌

    DRDO Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్... డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఖాళీల వివరాలు ఇవే

    BDL Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

    Indian Army Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో JCO / OR Enrolment పైన క్లిక్ చేయాలి.
    Eligibility Criteria for Recruitment Process పైన క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో కుడివైపు Apply Online పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత Registration పైన క్లిక్ చేయాలి.
    మీ వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
    ఆ తర్వాత apply online పైన క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ ఫిల్ చేయాలి.
    వివరాలన్నీ చెక్ చేసి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
    చివరగా సబ్మిట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: