భారత ఆర్మీ (Indian Army) ఆధ్వర్యంలోని సెంట్రల్ హెడ్ క్వార్టర్స్, బెంగళూరు (Bangalore) జాబ్ నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. కుక్, ఎంటీఎస్(చౌకీదార్), బార్బర్, గార్డెనర్, టిన్ స్మిత్, క్యాంప్ గార్డ్, ఫైర్‌మెన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, మెసెంజర్, క్లీనర్, సివిలియన్ మోటార్ డ్రైవర్ వంటి పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులోని ఆర్మీ సర్వీస్ కార్ప్స్(ASC)లో పనిచేయాల్సి ఉంటుంది. మాజీ సైనికులు, ప్రతిభావంతులైన క్రీడాకారులు, శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులను రిజర్వేషన్‌కు లోబడి ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తులను తగిన పోస్టల్ స్టాంప్, సెల్ఫ్-అడ్రస్‌తో రిజిస్టర్డ్ కవరు ద్వారా ఆఫ్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. అలాగే స్వీయ ధ్రువీకరణకు సంబంధించిన పత్రాల కాపీలను కూడా జత చేయాలి. నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నుంచి 21 రోజులలోపు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక ట్రేడ్(పోస్ట్)కు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ట్రేడ్‌లకు అప్లై చేసుకుంటే దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
అర్హత ప్రమాణాలు
ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హత పొందాలంటే, అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థల నుంచి 10వ తరగతి లేదా అందుకు సమానమైన పరీక్ష పాసై ఉండాలి. అలాగే దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్ట్‌కు అవసరమైన నైపుణ్యం, స్పెషలైజేషన్ చేసి ఉండాలి. స్టేషన్ మాస్టర్ వంటి కొన్ని పోస్ట్‌లకు, కనీస అర్హతగా 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు, సంబంధిత వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు దరఖాస్తు రసీదు చివరి తేదీ నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు. రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉండనుంది.
దరఖాస్తు విధానం
కుక్, సీసీఐ, ఎంటీఎస్(చౌకీదార్), టిన్ స్మిత్, ఈబీఆర్, బార్బర్, క్యాంప్ గార్డ్, గార్డెనర్, మెసెంజర్/ రెనో ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు తమ దరఖాస్తులను ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, సీహెచ్‌క్యూ, ఏఎస్‌సీ సెంటర్ (సౌత్) – 2 ఏటీసీ, Agram పోస్ట్, బెంగళూరు -07 అనే అడ్రస్‌కు పంపాలి.
స్టేషన్ ఆఫీసర్, ఫైర్‌మెన్, ఎఫ్‌ఈడీ, క్లీనర్, ఫైర్ ఫిట్టర్, సీఎండీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, సిహెచ్‌క్యూ, ఎఎస్‌సి సెంటర్ (నార్త్) - 1 ఎటిసి, ఆగ్రామ్ పోస్ట్, బెంగళూరు -07అనే అడ్రస్‌కు తమ దరఖాస్తులను పోస్ట్ లో పంపాలి.
ఎంపిక ప్రక్రియ
అవసరమైన పోస్టులకు స్కిల్, ఫిజికల్, ప్రాక్టికల్, రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ఇందులో నాలుగు భాగాలు.. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉంటాయి.
రాత పరీక్ష రెండు లాంగ్వేజ్‌ల్లో ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. అయితే ఇంగ్లిష్ లాంగ్వేజ్ సబ్జెక్టులోని ప్రశ్నలు మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాలకు 0.25 మార్కులు కోత విధిస్తారు. రాత పరీక్ష, స్కిల్, ఫిజికల్, ప్రాక్టికల్ టెస్ట్‌లు ASC సెంటర్ (సౌత్)/ (ఉత్తర) బెంగళూరు, కర్ణాటకలో మాత్రమే నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రం మార్పుకు సంబంధించి ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించరు.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థుల నెల జీతం రూ.18,000 నుంచి రూ. 29,200 పే స్కేల్ మధ్య ఉంటుంది. అలాగే డీఏ, ఇతర అలవెన్సులు అందనంగా ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army jobs, Career and Courses, Indian Army, JOBS