ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకునేవారి అద్భుతమైన అవకాశం వచ్చేసింది. తెలంగాణలోని హకీంపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. జనవరి 18 నుంచి సికింద్రాబాద్‌లో కూడా రిక్రూట్మెంట్ ర్యాలీ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి. సికింద్రాబాద్‌తో పాటు హకీంపేటలో కూడా రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనుంది ఇండియన్ ఆర్మీ. మార్చి 5 నుంచి 24 వరకు హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో ఈ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో పాల్గొనడానికి అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 19న ప్రారంభమవుతుంది. అప్లై చేయడానికి ఫిబ్రవరి 17 చివరి తేదీ. ఈ ర్యాలీకి సంబంధించిన అర్హతలు, ఇతర వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ర్యాలీలో పాల్గొనడానికి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో తెలుసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.
Army Public School Jobs: హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
MIDHANI Recruitment 2021: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Army Recruitment Rally Hakimpet 2021: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఇలా రిజిస్టర్ చేయండి
అభ్యర్థులు ముందుగా http://www.joinindianarmy.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
JCO/OR ఎన్రోల్మెంట్లో Apply /Login పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
అభ్యర్థుల వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
సేవ్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
ఆ తర్వాత లాగిన్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
డ్యాష్ బోర్డ్‌లో పోస్టును ఎంచుకొని నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి.
వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేసి కంటిన్యూ చేయాలి.
ఆ తర్వాత కమ్యూనికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
స్పోర్ట్స్, ఎన్సీసీ కోటా వర్తిస్తే ఆ వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
విద్యార్హతల వివరాలు, మార్కులు ఎంటర్ చేయాలి.
ఓసారి మీ వివరాలన్నీ సరిచూసుకొని సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత రోల్ నెంబర్ జనరేట్ అవుతుంది.
దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
ర్యాలీకి 10 నుంచి 15 రోజుల ముందు లాగిన్ అయి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ర్యాలీ జరిగే తేదీ, సమయం, వేదిక, నియమనిబంధనలు, ఇతర వివరాలన్నీ అడ్మిట్ కార్డులో ఉంటాయి.