హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. 10+2 ఎంట్రీ స్కీమ్.. ఇలా అప్లై చేసుకోండి..

Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. 10+2 ఎంట్రీ స్కీమ్.. ఇలా అప్లై చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Army Recruitment: ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(TES)లోని 10+2 ఎంట్రీ స్కీమ్ ద్వారా పోస్టుల భర్తీకి వివాహం కాని పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియన్ ఆర్మీ (Indian Army) టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(TES)లోని 10+2 ఎంట్రీ స్కీమ్-48 కోర్సు పోస్టుల భర్తీకి వివాహం కాని పురుష అభ్యర్థుల(Male Candidates) నుంచి దరఖాస్తుల (Applications)ను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న వారు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, సెప్టెంబర్ 21న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 90 ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నారు.


* ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 22, 2022

ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు: సెప్టెంబర్ 21, 2022


* ఖాళీల వివరాలు

10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) 48 కోర్సు: 90 ఖాళీలు


* వివిధ పోస్టుల జీతాల వివరాలు

లెఫ్టినెంట్: లెవల్10- రూ.56,100-1,77,500

కెప్టెన్: లెవల్10బీ- రూ.61,300-1,93,900

మేజర్: లెవల్11- రూ.69,400-2,07,200

లెఫ్టినెంట్ కల్నల్: లెవల్12ఏ- రూ.1,21,200-2,12,400

కల్నల్ లెవల్13- రూ.1,30,600-2,15,900

బ్రిగేడియర్ లెవల్13ఏ- రూ.1,39,600-2,17,600

మేజర్ జనరల్ లెవల్14- రూ.1,44,200-2,18,200

లెఫ్టినెంట్ జనరల్ HAG స్కేల్ లెవల్ 15- రూ.1,82,200- 2,24,100

లెఫ్టినెంట్ జనరల్ HAG + స్కేల్ లెవల్16- రూ. 2,05,400-2,24,400

VCOAS/ఆర్మీ Cdr/లెఫ్టినెంట్ జనరల్ (NFSG) లెవల్17- రూ. 2,25,000/-(ఫిక్స్డ్)

COAS లెవల్18- రూ. 2,50,000/-(ఫిక్స్‌డ్)



* అర్హత ప్రమాణాలు

గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో కనీసం 60% మార్కులతో 10+2 పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివిధ రాష్ట్ర/కేంద్ర బోర్డుల PCM శాతాన్ని లెక్కించడానికి అర్హత ప్రమాణాలు XII తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే ఉంటాయి. అభ్యర్థి తప్పనిసరిగా JEE (మెయిన్స్) -2022కు హాజరై ఉండాలి.


* ఎంపిక ప్రక్రియ

వచ్చిన అన్ని దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తరువాత ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటుంది.


ఇది కూడా చదవండి : తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఈ టిప్స్ తెలుసుకోండి


* అప్లికేషన్ ప్రాసెస్


స్టెప్-1: ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.gov.inను సందర్శించాలి.


స్టెప్-2: హోమ్‌పేజీలో “అప్లై ఆన్‌లైన్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.


స్టెప్-3: TES-48 ఎంట్రీ స్కీమ్ కోసం రిజిస్టర్ చేసుకోండి.


స్టెప్-4: ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్‌ నింపండి.


స్టెప్-5: అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.


స్టెప్-5: అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.


స్టెప్-5: అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.


మరోవైపు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) 323 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఏఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు బీఎస్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in ద్వారా సెప్టెంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

First published:

Tags: Army jobs, Career and Courses, Indian Army, JOBS

ఉత్తమ కథలు