బీటెక్ పాస్ అయినవారికి శుభవార్త. ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల (Indian Army Jobs) భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC) 2022 కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇండియన్ ఆర్మీ. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2022 జనవరి 4 చివరి తేదీ. ఈ పోస్టులకు పెళ్లికాని యువకులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 40 |
సివిల్ లేదా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ | 9 |
ఆర్కిటెక్చర్ | 1 |
మెకానికల్ | 5 |
ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ | 3 |
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఎంఎస్‌సీ కంప్యూటర్ సైన్స్ | 8 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 3 |
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ | 1 |
టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 1 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ | 2 |
ఏరోనాటికల్, ఏరో స్పేస్, ఏవియానిక్స్ | 1 |
ఎలక్ట్రానిక్స్ | 1 |
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ | 1 |
ప్రొడక్షన్ | 1 |
ఇండస్ట్రియల్ మ్యాన్యూఫ్యాక్చరింగ్ | 1 |
ఆప్టో ఎలక్ట్రానిక్స్ | 1 |
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ | 1 |
Andhra Pradesh Jobs: విశాఖపట్నంలో ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 4 సాయంత్రం 3 గంటలు
విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. బీటెక్ లేదా బీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు.
వయస్సు- 2022 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్లు. అంటే 1995 జూలై 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయొచ్చు.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్.
శిక్షణా కాలం- 49 వారాలు.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Step 1- అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Officers Entry Login పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి.
Step 4- అభ్యర్థి పేరు, ఆధార్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- ఆ తర్వాత ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
Step 6- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 7- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army jobs, Bank Jobs, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Indian Army, Job notification, JOBS