Home /News /jobs /

INDIAN AIRFORCE AGNIVEER NOTIFICATION 2022 RELEASED FULL DETAILS HERE VB

Indian Airforce Agniveer Notification 2022: అగ్నివీర్ IAF నోటిఫికేషన్ విడుదల.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indian Airforce Agniveer Notification 2022: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ 2022 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్(Agnipath Scheme) కింద అగ్నివీర్ రిక్రూట్‌మెంట్(Agniveer Recruitment) కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం 18 మరియు 23 సంవత్సరాల మధ్య భారతదేశంలోని ఏదైనా రాష్ట్రం(State) నుండి ఎవరైనా దరఖాస్తు(Application) చేసుకోవచ్చు.  అగ్నిపథ్​(Agnipath) పథకం కింద జూన్ 20న ఆర్మీ నోటిఫికేషన్​(Army Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్​ కింద అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిక్రూట్​మెంట్​ వెబ్​సైట్​లో https://careerindianairforce.cdac.in/ ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవడం తప్పనిసరి . జూన్ 24 ఉదయం 10 నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూలై 24వ తేదీన పరీక్ష జరగనుంది.   ఈ నెల 24న ఇండియన్ నేవీ నోటిఫికేషన్‌‌ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Agnipath Agniveers Salaries: అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల.. అగ్నివీరులకు వేతనం ఎంతో తెలుసా?


దరఖాస్తు రుసుము
పరీక్ష ఫీజు రూ. 250/ – ఆన్‌లైన్ పరీక్ష కోసం అభ్యర్థి చెల్లించాలి. చెల్లింపు గేట్‌వే ద్వారా డెబిట్ కార్డ్‌లు/క్రెడిట్ కార్డ్‌లు/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. ఏదైనా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో చలాన్ చెల్లింపు ద్వారా పరీక్ష రుసుమును కూడా చెల్లించవచ్చు.



వయో పరిమితి
29 డిసెంబర్ 1999, 29 జూన్ 2005 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నమోదు చేసుకున్న తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలు దాటకూడదు.

అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ వైద్య ప్రమాణాలు క్రింది విధంగా ఉండాలి..
కనీస ఎత్తు 152.5 సెం.మీ, ఛాతీ కనిష్ట విస్తరణ పరిధి 5 సెం.మీ, బరువు ఎత్తు, వయస్సుకు తగ్గట్లు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కార్నియల్ సర్జరీ (PRK/LASIK) ఆమోదయోగ్యం కాదు. అభ్యర్థి సాధారణ వినికిడిని కలిగి ఉండాలి. ఆరోగ్యకరమైన చిగుళ్ళు, మంచి దంతాలు , కనీసం 14 డెంటల్ పాయింట్లు ఉండాలని పేర్కొన్నారు.

Agnipath Notification Qualifications: అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల.. విద్యార్హతల వివరాలివే

కేంద్ర ప్రభుత్వం జూన్ 14న అగ్నిపథ్​ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్​ కింద 17.5 సంవత్సరాల నుంచి 21 ఏండ్ల మధ్య వయస్సు గల యువకులను నాలుగు సంవత్సరాల కాలానికి మాత్రమే రిక్రూట్‌‌ చేసుకుంటారు.అయితే 2022లో రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం వయో పరిమితిని కేంద్రం 23 ఏండ్లకు పొడిగించింది. ఈ వయో పరిమితి అనేది కేవలం ఈ సంవత్సరం వరకు మాత్రమే వర్తించనుంది. 4 ఏళ్లు పని చేసిన తర్వాత ఎంపికైనా వారిలో 25 శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు కొనసాగించే నిబంధన ఉంది. నాలుగేండ్లు పూర్తయిన తర్వాత అగ్నివీర్లకు ఎంపిక చేసుకునే హక్కు ఉండదు. అంటే రెగ్యూలర్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 75 శాతం మందిని సేవానిధి నుంచి రూ.11లక్షలు ఇవ్వనున్నారు. అంతే కాకుండా.. స్వయం ఉపాధి అవకాశాలను బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం కూడా కల్పించనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Agnipath Scheme, Indian Military, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు