ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2 2021 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. జనవరిలో AFCAT దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 235 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇప్పుడు 334 పోస్టులతో AFCAT 2 నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్‌కు 2021 జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తు చేయొచ్చు. https://www.careerindianairforce.cdac.in/ లేదా https://afcat.cdac.in/ వెబ్సైట్లలో త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదలౌతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ బ్యాచెస్ (టెక్నికల్, నాన్ టెక్నికల్) లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలౌతుంది. ఎంపికైనవారికి హైదరాబాద్‌లోని దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఇస్తుంది ఐఏఎఫ్.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 30
AFCAT 2 2021 అడ్మిట్ కార్డుల విడుదల- త్వరలో తేదీలను వెల్లడించనున్న ఐఏఎఫ్
AFCAT 2 2021 ఎగ్జామ్- త్వరలో తేదీలను వెల్లడించనున్న ఐఏఎఫ్
కోర్సు ప్రారంభం- త్వరలో తేదీలను వెల్లడించనున్న ఐఏఎఫ్
Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం... 12 మందికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్
SBI Apprentice 2021: ఎస్బీఐలో అప్రెంటీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? ఎగ్జామ్ ఎప్పుడంటే
మొత్తం ఖాళీలు- 334
విద్యార్హత- మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 పాస్ కావాలి. మూడేళ్ల డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. లేదా బీఈ, బీటెక్ నాలుగేళ్ల కోర్సు పాస్ కావాలి.
విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వయస్సు- 25 ఏళ్ల లోపు ఉండాలి. కోర్సు ప్రారంభం అయ్యేనాటికి పెళ్లి కాకూడదు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు- రూ.250
Railway Jobs: రైల్వేలో 3591 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు
Teacher Jobs 2021: మొత్తం 7,236 టీచర్ పోస్టుల ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తులు
అభ్యర్థులు https://www.careerindianairforce.cdac.in/ లేదా https://afcat.cdac.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో CANDIDATE LOGIN పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.
పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత మెయిల్ ఐడీకి ఐడీ, పాస్వర్డ్ వస్తుంది.
ఐడీ, పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత మిగతా వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
పేమెంట్ చేసి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, IAF, Indian Air Force, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs