Indian Air Force Jobs: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

IAF Airmen Recruitment 2020 | ఇంటర్ పాసైనవారికి శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: November 24, 2020, 6:08 PM IST
Indian Air Force Jobs: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు
Indian Air Force Jobs: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై ట్రేడ్స్‌లో ఎయిర్‌మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 నవంబర్ 27న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి నవంబర్ 28 చివరి తేదీ. అంటే అప్లై చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ రెండు రోజుల్లోనే దరఖాస్తు చేసేందుకు సిద్ధం కావాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://airmenselection.cdac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు లింక్ నవంబర్ 27న యాక్టివేట్ అవుతుంది. ఇక దరఖాస్తు చేసుకున్న వారికి రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2020 డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 19 మధ్య జరుగుతుంది. న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పుదుచ్చెరీలో ర్యాలీలు ఉంటాయి. ర్యాలీ వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయి.

Canara Bank Jobs: కెనెరా బ్యాంకులో 220 ఉద్యోగాలు... విద్యార్హతలు ఇవే

RITES Recruitment 2020: రైల్వే సంస్థలో 170 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

IAF Airmen Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2020 నవంబర్ 27 ఉదయం 11 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 28 సాయంత్రం 5 గంటలు
రిక్రూట్‌మెంట్ ర్యాలీ-

విద్యార్హత- 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలు కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇంగ్లీష్‌లో 50 శాతం కన్నా ఎక్కువ మార్కులుండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సు పాసైనవారు కూడా అప్లై చేయొచ్చు.
వయస్సు- 2000 జనవరి 17 నుంచి 2003 డిసెంబర్ 30 మధ్య జన్మించినవారు అప్లై చేయాలి.
ఎంపిక విధానం- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్
ఇతర అర్హతలు- పెళ్లికాని పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Published by: Santhosh Kumar S
First published: November 24, 2020, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading