IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 282 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 282 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IAF Recruitment 2021 | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-IAF ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 282 ఖాళీలను భర్తీ చేస్తోంది. కుక్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కూడా పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.

    IAF Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 282
    మెయింటైనెన్స్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 153
    ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 32
    సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 11
    ఇండిపెండెంట్ యూనిట్స్- 1
    కుక్ (ఆర్డినరీ గ్రేడ్)- 1
    మెస్ స్టాఫ్- 9
    మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 18
    హౌస్ కీపింగ్ స్టాఫ్- 15
    హిందీ టైపిస్ట్- 3
    లోయర్ డివిజన్ క్లర్క్- 10
    స్టోర్ కీపర్- 3
    కార్పెంటర్- 3
    పెయింటర్- 1
    సూపరింటెండెంట్ (స్టోర్)- 5
    సివిలియన్ మెకానిక్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్- 3

    Head Constable Jobs: ఇంటర్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    ECIL Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    IAF Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 7
    విద్యార్హతలు- సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీ, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ పోస్టులకు ఇంటర్, కుక్ పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా డిప్లొమా ఇన్ కేటరింగ్, ఇతర పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి.
    ఎంపిక విధానం- రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్.
    వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు

    RRB Exam Fee Refund: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ఫీజు రీఫండ్ చేస్తున్న ఆర్ఆర్‌బీ... ఇలా అప్లై చేయండి

    RRB NTPC Results: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఎగ్జామ్ రాశారా? మీ మార్కులు ఇలా తెలుసుకోండి

    IAF Recruitment 2021: అప్లే చేయండి ఇలా


    వేర్వేరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
    అభ్యర్థులు సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ల దగ్గర దరఖాస్తులు ఇవ్వాలి.
    దరఖాస్తు ఫామ్ https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేయాలి.
    దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
    నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పోస్టులో పంపాలి.
    Published by:Santhosh Kumar S
    First published: