ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ ఎక్స్, వై ట్రేడ్స్‌లో ఎయిర్‌మ్యాన్ పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF. పెళ్లికాని పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. https://airmenselection.cdac.in/ లేదా https://careerindianairforce.cdac.in/ వెబ్సైట్లల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2019 జూలై 1న ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ జూన్ 22 నాటి ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో ప్రచురించనుంది ఐఏఎఫ్. ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
Indian Air Force recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...
పోస్టుల వివరాలు: గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై ట్రేడ్స్‌లో ఎయిర్‌మెన్ పోస్టులు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 1
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూలై 15
అర్హత: గ్రూప్ ఎక్స్ ట్రేడ్ కోసం ఇంటర్, 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. గ్రూప్ వై ట్రేడ్స్ కోసం రెండేళ్ల వొకేషనల్ కోర్సులో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి.
వయస్సు: 1999 జనవరి 9 నుంచి 2003 జనవరి 1 మధ్య జన్మించినవాళ్లే అర్హులు.
పరీక్ష ఫీజు: రూ.250
Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Bamboo Business: వెదురు పంటతో లక్షల్లో ఆదాయం... ఆ ఐడియా ఇదే
Aadhaar Contest: ఆధార్ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.30,000 బహుమతి
LIC: మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దుPublished by:Santhosh Kumar S
First published:June 21, 2019, 18:26 IST