INDIAN AIR FORCE INVITES APPLICATIONS TO FILL 249 VACANCIES THROUGH IAF AFCAT 2020 APPLY BEFORE DECEMBER 31 SS
Air Force Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో శిక్షణ
Indian Air Force Jobs: ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్
(ప్రతీకాత్మక చిత్రం)
IAF AFCAT 2020 | పెళ్లికాని యువతీయువకులే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు, వయస్సు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2020 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆన్లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వారికి హైదరాబాద్‌లోని దుండిగల్‌లో గల ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. పెళ్లికాని యువతీయువకులే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు, వయస్సు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు afcat.cdac.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు www.indianairforce.nic.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
IAF AFCAT 2020: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 249
ఫ్లయింగ్ బ్రాంచ్ షార్ట్ సర్వీస్ కమిషన్- 60
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)- 105
గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)- 84
విద్యార్హత- మ్యాథ్స్, ఫిజిక్స్‌తో 60% మార్కులతో 10+2 పాస్ కావాలి
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 31
వయస్సు- 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 26 ఏళ్లు
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2020 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.