ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (India Air Force) లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) దేశంలో పలు చోట్ల ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్స్, యూనిట్స్‌లో భారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 282 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కుక్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కూడా పలు పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 7 లాస్ట్ డేట్. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ లాంటి కోర్సులు పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.
అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి. రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అప్లికేషన్ ఫామ్స్ పంపాలి. వేర్వేరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్స్, యూనిట్స్‌కు వేర్వేరు అడ్రస్‌లు ఉన్నాయి. అభ్యర్థులు ఏ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ లేదా యూనిట్‌కు దరఖాస్తు చేస్తే సంబంధిత అడ్రస్‌కే దరఖాస్తుల్ని పంపాల్సి ఉంటుంది.
South Indian Bank Jobs 2021: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు... రూ.63,840 వేతనం
మొత్తం ఖాళీలు | 282 |
మెయింటైనెన్స్ కమాండ్, హెడ్‌క్వార్టర్ | 153 |
ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్ | 32 |
సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్ | 11 |
ఇండిపెండెంట్ యూనిట్స్ | 1 |
కుక్ (ఆర్డినరీ గ్రేడ్) | 1 |
మెస్ స్టాఫ్ | 9 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 18 |
హౌస్ కీపింగ్ స్టాఫ్ | 15 |
హిందీ టైపిస్ట్ | 3 |
లోయర్ డివిజన్ క్లర్క్ | 10 |
స్టోర్ కీపర్ | 3 |
కార్పెంటర్ | 3 |
పెయింటర్ | 1 |
సూపరింటెండెంట్ (స్టోర్) | 5 |
సివిలియన్ మెకానిక్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ | 3 |
Jobs in Network18: మీడియాలో జాబ్ మీ కలా? నెట్వర్క్18 లో ఫ్రెషర్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 7
విద్యార్హతలు- సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీ, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ పోస్టులకు ఇంటర్, కుక్ పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా డిప్లొమా ఇన్ కేటరింగ్, ఇతర పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి.
ఎంపిక విధానం- రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్.
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు
Step 1- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ https://indianairforce.nic.in/ లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయొచ్చు.
Step 2- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
Step 3- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
Step 4- నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పోస్టులో పంపాలి. సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ లేదా యూనిట్‌కు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దరఖాస్తు ఫామ్స్ పంపాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Indian Air Force, Job notification, JOBS