Home /News /jobs /

INDIAN AIR FORCE IAF GROUP C RECRUITMENT 2022 APPLY FOR MTS COOK OTHER POSTS KNOW FULL DETAISL HERE VB

IAF Group C Recruitment 2022: పది పాసైతే చాలు.. ఎయిర్ ఫోర్స్ లో ఈ ఉద్యోగాలు మీ కోసమే.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కింద కుక్, A/C మెకానికల్, మెస్ స్టాఫ్, కార్పెంటర్, స్టెనో గ్రేడ్ 2,  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), స్టోర్ కీపర్, LDC, CMTDతో సహా పలు పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force), IAF వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లు/యూనిట్‌లలో గ్రూప్ 'సి' సివిలియన్(Civilian) పోస్టులకు దరఖాస్తు(Application) చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత సబ్జెక్టులో పదో తరగతి (Tenth Class) విద్యార్హత ఉన్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. అభ్యర్థులు(Aspirants) తప్పనిసరిగా 18-25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్(Reserved) కేటగిరీకి చెందిన అర్హులైన అభ్యర్థులందరికీ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రకటన ప్రచురించిన దగ్గర నుంచి 30 రోజుల లోపు (1 ఆగస్టు 2022) ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌నుసమర్పించాలని సూచించారు.

Petrol Rates: ఇక్కడ పెట్రోల్ రేట్లు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. లీటరు పెట్రోల్ రూ.2 నుంచి రూ. 45 వరకు..


వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ మరియు మెయింటెనెన్స్ కమాండ్ యొక్క ప్రధాన కార్యాలయంలో మొత్తం 21 ఖాళీలు నోటిఫై చేయబడ్డాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 1 ఆగస్టు, 2022లోపు దరఖాస్తులను సమర్పించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాత పరీక్ష, మెడికల్ టెస్టు, ఫిజికల్ టెస్టు ఆధారంగా  దీనిలో ఎంపికలు జరుగుతాయి. IAF గ్రూప్ C సివిలియన్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అభ్యర్థులు తమ దరఖాస్తులను కింద తెలిపిన అడ్రస్ కు పంపించొచ్చు. పోస్టును బట్టి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.



దరఖాస్తులను ఈ చిరునామాలకు పంపించొచ్చు.. 

ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంబాలా, అంబాలా కాంట్ (హర్యానా), పిన్ - 133001 లేదా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్, క్లెమెంట్ టౌన్, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), పిన్ - 248002 లేదా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిండన్, ఘజియాబాద్ (UP), PIN - 201004 లేదా స్టేషన్ కమాండర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నల్, బికనీర్ (రాజస్థాన్), పిన్ - 334001 లేదా స్టేషన్ కమాండర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కసౌలి, పోస్ట్ - కసౌలి, జిల్లా - సోలన్ (HP), పిన్ - 173204 లేదా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, మాస్టర్ కంట్రోల్ సెంటర్, AF స్టేషన్, బసంత్ నగర్, న్యూఢిల్లీ - 110010. వీటిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో సరిచూసుకొని అప్లికేషన్ ను పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://indianairforce.nic.in/వెబ్ సైట్ ను సందర్శించండి.

ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఎలా..? ఎక్కడ దరఖాస్తు చేయాలి..?

Step 1: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – indianairforce.nic.inలో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Step 2: అభ్యర్థులు ఇంగ్లీషు/హిందీలో రూపొందించిన దరఖాస్తు ఫారమ్‌ను ఇటీవలి ఫోటోను అటెస్ట్ చేసి దాని కింద సంతకం చేయాలి.  అవసరమైన డాక్యుమెట్లను జత చేసి కింద తెలిపిన చిరునామాకు పంపించాలి.

Step 3: దరఖాస్తు ఫారమ్‌లో చిరునామాను ఇంగ్లీష్/హిందీలో టైప్ చేయాలి.
ఒక వేళ అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించాలనుకుంటే.. ప్రత్యేకంగా మరో దరఖాస్తును సమర్పించాలి.  అభ్యర్థులు కవరు పైభాగంలో వారు దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరును పేర్కొనవలసి ఉంటుంది.

ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ 2022 ఖాళీల వివరాలిలా.. కుక్ పోస్టులు 07, ఏసీ మెకానిక్ పోస్టులు 01, మెస్ స్టాఫ్ పోస్టులు 01, కార్పెంటర్ పోస్టులు 01, స్టెనో జీడీ 2 పోస్టులు 01, ఎంటీఎస్ పోస్టులు 05, స్టోర్ కీపర్ పోస్టులు, 01, ఎల్డీసీ పోస్టులు 01 మరియు సీఎంటీడీ పోస్టులు 03 కలవు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Indian Air Force, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు