IAF Jobs: రేపటి నుంచి సంగారెడ్డిలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... జిల్లావారీగా తేదీలివే

IAF Jobs: రేపటి నుంచి సంగారెడ్డిలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... జిల్లావారీగా తేదీలివే (ప్రతీకాత్మక చిత్రం)

Indian Air Force Recruitment Rally | వేర్వేరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు వేర్వేరు తేదీల్లో ర్యాలీకి హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ర్యాలీలో ఎంపికైన వారికి 6 నెలల నుంచి ఏడాది శిక్షణ ఉంటుంది.

  • Share this:
    తెలంగాణలో రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-IAF. సంగారెడ్డిలో జనవరి 17 నుంచి 21 వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించేందుకు తెలంగాణలోని నిరుద్యోగులకు లభిస్తున్న మంచి అవకాశం ఇది. ఈ ర్యాలీ ద్వారా ఎయిర్‌మెన్ గ్రూప్ వై-నాన్ టెక్నికల్, ఆటోమొబైల్ టెక్నీషియన్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోలీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐఏఎఫ్. పెళ్లికాని పురుష అభ్యర్థులు సంగారెడ్డిలో జరిగే ర్యాలీకి హాజరుకావచ్చు. వేర్వేరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు వేర్వేరు తేదీల్లో ర్యాలీకి హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ర్యాలీలో ఎంపికైన వారికి 6 నెలల నుంచి ఏడాది శిక్షణ ఉంటుంది.


    IAF Recruitment Rally 2020: ఐఏఎఫ్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ వివరాలివే...


    ర్యాలీ జరిగే ప్రదేశం: జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సుల్తాన్ పూర్, సంగారెడ్డి
    ర్యాలీ జరిగే తేదీలు: 2020 జనవరి 17 నుంచి 21 వరకు
    2020 జనవరి 17: ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కేంద్రపాలిత ప్రాంతంలోని యానాంకు చెందిన అభ్యర్థులు జనవరి 17 ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేయాలి.
    2020 జనవరి 19: రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, నారాయణపేట్, జనగామ్, సూర్యపేట్, సిద్దిపేట్, మెదక్, నల్గొండ, వనపర్తి, మహబూబ్‌నగర్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందినవారు జనవరి 19న ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేయాలి.
    విద్యార్హత- ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్‌లో ఇంటర్ రెండు సంవత్సరాల్లో 50 శాతం మార్కులు ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పోలీస్ ఉద్యోగానికి 175 సెంటీమీటర్ల ఎత్తు, ఆటో టెక్నీషియన్‌కు 165 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
    వయస్సు- 2000 జనవరి 17 నుంచి 2003 డిసెంబర్ 30 మధ్య జన్మించినవారే దరఖాస్తు చేయాలి
    ఎంపిక విధానం- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2
    వేతనం- శిక్షణ కాలంలో స్టైపెండ్. ఉద్యోగంలో చేరిన తర్వాత రూ.21,700 వేతనం.
    ఈ ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    పూర్తి వివరాల కోసం https://airmenselection.cdac.in/ వెబ్‌సైట్ చూడండి.
    ఐఏఎఫ్‌లో ఇతర ఉద్యోగాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    IOCL Jobs 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 248 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు

    SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

    Jobs: ఈ ఏడాది ఈ 10 ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్

    AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి
    Published by:Santhosh Kumar S
    First published: