Air Force Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ

Indian Air Force Airmen Recruitment 2019 | ఉద్యోగానికి ఎంపికయ్యే ప్రక్రియలో భాగంగా రాతపరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ రౌండ్స్‌లో క్వాలిఫై కావాలి. ఎంపికైనవారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి.

news18-telugu
Updated: July 1, 2019, 4:51 PM IST
Air Force Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ
Air Force Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ (ప్రతీకాత్మక చిత్రం, image: PTI)
news18-telugu
Updated: July 1, 2019, 4:51 PM IST
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూలై 1న ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితమే గ్రూప్ ఎక్స్, వై ట్రేడ్స్‌లో ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-IAF. జూలై 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 15న ముగుస్తుంది. అంతలోపే ఆసక్తిగల అభ్యర్థులు airmenselection.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష పాసైనవాళ్లు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.14,600 స్టైపెండ్ లభిస్తుంది. ఎంపికైన తర్వాత గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్‌కు నెలకు రూ.33,100, గ్రూప్ వై ట్రేడ్స్‌కు నెలకు రూ.26,900 వేతనం లభిస్తుంది. దాంతో పాటు అలవెన్సులు, గ్రూప్ ఇన్స్యూరెన్స్ లాంటి ప్రయోజనాలుంటాయి. ఉద్యోగానికి ఎంపికయ్యే ప్రక్రియలో భాగంగా రాతపరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ రౌండ్స్‌లో క్వాలిఫై కావాలి. ఎంపికైనవారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ 2020 ఏప్రిల్ 30న విడుదలవుతుంది.

Indian Air Force Airmen Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 జూలై 1

దరఖాస్తు ప్రక్రియ ముగింపు: 2019 జూలై 15
విద్యార్హత: 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలు కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్‌లో 50 శాతం కన్నా ఎక్కువ మార్కులుండాలి.
వయస్సు: 1999 జూలై 19 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించినవారికే అవకాశం. గరిష్ట వయస్సు 21 ఏళ్లు.


పెళ్లికాని పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Loading...

Indian Air Force Airmen Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...


ముందుగా airmenselection.cdac.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో ‘ST intake’ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
‘New user Register’ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
లాగిన్ కోసం మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ ఉపయోగించాలి.
దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
చివరగా పేమెంట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

ఎయిర్‌మెన్ ఉద్యోగాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Indian Navy Jobs: నేవీలో 2700 ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

Railways: అమ్మాయిలు రైల్వే పరీక్ష రాస్తే ఫీజు వాపస్
First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...