HOME »NEWS »JOBS & EDUCATION »indian air force air force common admission test iaf afcat 2020 notification released for 256 posts know full details ss

IAF Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 256 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్

IAF Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 256 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్
IAF Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 256 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

IAF AFCAT 2 Recruitment 2020 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం మీ కలా? భారత వైమానిక దళంలో పనిచేయాలనుకుంటున్నారా? ఇంటర్ అర్హతతో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఏఎఫ్. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇంటర్ పాసైనవారికి శుభవార్త. ఇంటర్మీడియట్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2020 జూన్ 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 14 చివరి తేదీ. మొత్తం 256 ఖాళీలను ప్రకటించింది ఐఏఎఫ్. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF. ఎంపికైనవారికి హైదరాబాద్‌లోని దుండిగల్‌లో గల ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వనుంది. పెళ్లికాని యువతీయువకులే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://afcat.cdac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

    IAF AFCAT 2 Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 256


    ఫ్లయింగ్ బ్రాంచ్- 74
    గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)- 105
    గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)- 55
    మెటరాలజీ- 22

    IAF AFCAT 2 Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 15
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 14
    అడ్మిట్ కార్డుల విడుదల- 2020 సెప్టెంబర్ 4
    పరీక్ష తేదీ- 2020 సెప్టెంబర్ 19
    శిక్షణ ప్రారంభం- 2021 జూలై
    విద్యార్హత- ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
    దరఖాస్తు ఫీజు- రూ.250

    ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2020 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Powergrid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 119 జాబ్స్... ఖాళీల వివరాలివే

    Railway Jobs: రైల్వేలో 196 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Telangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:June 16, 2020, 09:05 IST