INDIA SKILL REPORT OVER FIFTY PERCENT OF GRADUATES LACK SKILLS MORE EMPLOYMENT OPPORTUNITIES FOR THOSE WITH A FEW DEGREES EVK
India Skill Report: యూభై శాతంపైగా గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాల కొరత.. కొన్ని డిగ్రీల వారికే ఎక్కువ ఉపాధి అవకాశాలు.. ఇండియా స్కిల్ రిపోర్ట్ వెల్లడి
ప్రతీకాత్మక చిత్రం
India Skill Report: ప్రతే ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారు. కాలేజీల నుంచి బయటకు వచ్చిన విద్యార్థుల్లో చాలా మందికి ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలపై ఇండియా స్కిల్ రిపోర్ట్ 2022 ప్రకటించింది. ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ప్రతే ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారు. కాలేజీల నుంచి బయటకు వచ్చిన విద్యార్థుల్లో చాలా మందికి ఉపాధి అవకాశాలు (Job Opportunities) , నైపుణ్యాలపై ఇండియా స్కిల్ రిపోర్ట్ 2022 ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం 2022లో డిగ్రీ పూర్తి చేసిన వారిలో 46.2శాతం మంది ఉపాధి పొదారు. ఈ శాతం 2021లో 45.9 శాతంగా ఉందని రిపోర్ట్ (Report) పేర్కొంది. కరోనా కారణంగా ఉద్యోగ అవకాశల వృద్ధి తక్కువగా ఉందని రిపోర్ట్ పేర్కొంది. 2019లో డిగ్రీ పూర్తి చేసిన వారిలో 47.38 శాతం మందికి ఉపాధి అవకాశాలు లభించేవని రిపోర్ట్ పేర్కొంది. ఈ స్కిల్ రిపోర్ట్ ప్రకారం ఏటా ఏఏ రంగాల్లో డిగ్రీ (Degree) పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఎక్కువగా ఏ రంగంలో స్థిర పడుతున్నారు అనే అంశాలను ఈ సర్వే రిపోర్టు వెల్లడించింది.
రిపోర్టు వివరాలు..
- స్కిల్ రిపోర్ట్ 2022 ప్రకారం ఎక్కువగా బీటెక్ (BTech), బీఈ (BE) చదివిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. బీటెక్, బీఈ చేసిన వారిలో 55.15శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారని నివేదికలో వెల్లడైంది.
- 2021లో ఈ శాతం 46.82 ఉండగా ఈ సారి గణనీయంగా పెరిగడం విశేషం.
- ఇంజనీరింగ్ తరువాత స్థానంలో ఎంబీఏ (MBA) ఉంది. ఎంబీఏ చేసిన వారిలో 55.09 శాతం మంది ఉపాధి పొందగలరని సర్వే రిపోర్ట్ తెలిపింది.
- అత్యల్పంగా ఎంసీఏ చేసినవారిలో 21.43 శాతం మాత్రమే ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందని 2022లో 29.3శాతం గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందారని సర్వే తెలిపింది.
రంగాల వారీగా, BFSI, సాఫ్ట్‌వేర్/హార్డ్‌వేర్, IT, ఇంటర్నెట్ వ్యాపారం 2021లో అయితే 2022లో అత్యధిక ఉద్యోగాలను ఇచ్చాయని తెలిపింది. ISR 2022 ప్రకారం, ఇంటర్నెట్, బిజినెస్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ & IT, ఫార్మా మరియు BFSI టాప్ రిక్రూటర్‌లుగా ఉన్నాయి. నివేదిక వివరాల ప్రకారం డిజిటల్ అడాప్షన్ రాబోయే సంవత్సరాల్లో కొత్త నైపుణ్యాలు అవసరం అని తెలిపింది. 2030 నాటికి 20 మిలియన్లకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని అంచనా వేసింది. 2022 నాటికి 133 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేశారు.
Report
అత్యధిక ఉద్యోగావకాశాలు కలిగిన రాష్ట్రాలు
ర్యాంక్ 1: మహారాష్ట్ర
ర్యాంక్ 2: ఉత్తరప్రదేశ్
ర్యాంక్ 3: కేరళ
ర్యాంక్ 4: పశ్చిమ బెంగాల్
ర్యాంక్ 5: కర్ణాటక
ర్యాంక్ 6: ఢిల్లీ
ర్యాంక్ 7: ఆంధ్రప్రదేశ్
ర్యాంక్ 8: తమిళనాడు
ర్యాంక్ 9: గుజరాత్
ర్యాంక్ 10: హర్యానా
మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాల్లో ఉద్యోగాల డిమాండ్ పెరిగింది. 2021లో ఢిల్లీ, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ అత్యధిక రిక్రూటర్‌లుగా ఉన్నారు. 2022లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు కేరళ అత్యధిక రిక్రూటర్ రాష్ట్రాలుగా ఉన్నాయి. ఉపాధి యోగ్యమైన వనరులలో కేరళ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో అవకాశాలు వీటి కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. రాష్ట్రంలో గత ఏడాది కాలంలో అత్యధికంగా 15.77 శాతం నిరుద్యోగం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలోని టైర్ 1 మరియు 2 నగరాలు కొత్త ఉద్యోగాల కోసం కేరళ రాష్ట్రం నుంచి చాలా మంది అభ్యర్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు..
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.