Setti Jagadeesh, News 18, Visakhapatnam
భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన తపాలాశాఖ (India Post) లో ఉద్యోగాలంటే, ఆ అవకాశం కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పోస్టుమ్యాన్ పోస్టులతో (Post Man Jobs) పాటు, తపాలాశాఖ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. జోన్ విధానంలో తీసే ఈ పోస్టులకు పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. గతంలో ఒకప్పుడు కేవలం ఆంగ్ల, హిందీ భాషల్లో మాత్రమే అర్హత పరీక్ష ఉండేది. కాని గడిచిన పదేళ్లుగా తీస్తున్న పోస్టులకు తెలుగు భాషలో కూడా పరీక్ష పత్రం తయారు చేయడం వస్తోంది. దీంతో తెలుగు విద్యార్థులకు తపాలాశాఖ ఉద్యోగం కాస్త సులువైందనే చెప్పాలి.
తపాలాశాఖలో కొన్ని పోస్టులు మాత్రం మెరిట్ ఆధారంగా వస్తుంటాయి. పదవ తరగతి. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా పోస్టు కేటాయిస్తారు. మెరిట్ ప్రకారంగా చూస్తే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రావడం పక్కా, ఇలా ప్రతీయేటా తపాలాశాఖ ఏదోక రూపంలో పోస్టులను భర్తీ చేస్తోంది. తాజాగా ఫీల్డ్ ఆఫీసర్, తపాల ఏజెంట్ల నియామకానికి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. 18 నుండి 50 సంవత్సరలు గల వారికి అవకాశం కల్పిస్తోంది. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 11వ తేది ఆఖరు. విశాఖపట్నంలోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయానికి దరఖాస్తు పంపించాలి. వివరాలకు 94418 65857 నెంబరును సంప్రదించవచ్చు. ఆఖరు రోజు సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తులు నేరుగా కూడా స్వీకరిస్తారు.
ఫీల్డ్ ఆఫిసర్ తో పాటు, తపాలా ఏజెంట్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఏజెంట్లు తపాలా జీవిత భీమా స్కీములను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందించేందుకు తోడ్పడాలి. వారికి కమిషన్ తోపాటు, ఇన్సెన్‌టీవ్ లు ఉంటాయి. సీనియారిటీ ఆధారంగా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ గా కూడా ఏజెంట్ గా పనిచేయవచ్చు. పాలసీలు ఎక్కువ చేయడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. సీనియారిటీ పెరిగే కొలది తపాలాశాఖలోనే వారికి మరింత మంచి అవకాశాలు వస్తాయి.
దీనిపై తపాలాశాఖ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒకప్పుడు తపాలా అంటే కేవలం డబ్బులు దాచుకోవడానికి మాత్రమే ఉండేది. కానీ జీవిత భీమాలోనూ తపాలా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఫీల్డ్ ఆఫీసర్లు, ఏజెంట్ల నియామకం చాలా మంది నిరుద్యోగులకు వరంగా మారిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News, Postal jobs