ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా రెండు దశల్లో గ్రామీణ డాక్ సేవక్-GDS పోస్టుల్ని భర్తీ చేస్తుందన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో 1150, ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టుల భర్తీకి 2021 ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేసే పోస్టులు కావడంలో లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఎలాంటి పరీక్ష లేకుండా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తుండటంతో పోటీ కూడా తీవ్రంగా ఉంది. సాధారణంగా దరఖాస్తు గడువు ముగిసిన ఒకట్రెండు నెలల్లోనే ఫలితాలు విడుదలవుతూ ఉంటాయి. కానీ... ఫిబ్రవరిలో దరఖాస్తు గడువు ముగిసినా ఇప్పటివరకు ఫలితాలు విడుదల కాకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నాలుగు నెలలుగా లక్షలాది మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
అభ్యర్థులు అంచనా వేసినదాని ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ డాక్ సేవక్-GDS పోస్టులకు సంబంధించిన ఫలితాలు మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల కావాలి. కానీ నాలుగు నెలలైనా విడుదల కాకపోవడంతో అభ్యర్థులు సోషల్ మీడియాలో ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. ఫలితాలు ఎప్పుడు విడుదలౌతాయంటూ ట్విట్టర్లో ఇండియా పోస్ట్‌ను ప్రశ్నిస్తున్నారు.
Finalization of result in respect of GDS phase III recruitment is under process and efforts are being taken to complete it as early as possible
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ డాక్ సేవక్-GDS ఫలితాలను త్వరలో వెల్లడిస్తామని ట్విట్టర్లో తెలిపింది ఇండియా పోస్ట్. ఫలితాలు ప్రాసెస్‌లో ఉన్నాయని వెల్లడించింది. గత రెండుమూడు నెలలుగా ఇండియా పోస్ట్ ఇదే విషయం చెబుతోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని భావిస్తున్నారు.
గ్రామీణ డాక్ సేవక్-GDS పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అభ్యర్థులు రిజల్ట్స్‌కు సంబంధించిన అప్డేట్స్ కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ https://appost.in/ మాత్రమే ఫాలో కావాలి. పోస్ట్ ఆఫీస్ జాబ్స్ ఇప్పిస్తామని ఎవరైనా కాల్ చేసినా, మెయిల్లో సంప్రదించినా అభ్యర్థులు నమ్మకూడదు.
ఇక ఇప్పటికే జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదలయ్యాయి. బీహార్‌లో 1940 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియా పోస్ట్.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.