హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Post Office Jobs: పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

Post Office Jobs: పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

Post Office Jobs: పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs: పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs | పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. టెన్త్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఎంపికైనవారికిరూ.63,200 వేతనం లభిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇండియా పోస్ట్ (India Post) రెండు రోజుల క్రితం గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులతో పాటు ఇతర పోస్టుల్ని కూడా భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. తమిళనాడు సర్కిల్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) ఉద్యోగాల భర్తీకి కొద్ది రోజుల క్రితం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్, చెన్నై సిటీ రీజియన్, సెంట్రల్ రీజియన్, సదరన్ రీజియన్, వెస్టర్న్ రీజియన్‌లో ఈ పోస్టులున్నాయి. మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ.

ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/ లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Job Alert: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 616 ఉద్యోగాలు ... అప్లై చేయండి ఇలా

India Post Recruitment 2023: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు58
చెన్నై సిటీ రీజియన్6
సెంట్రల్ రీజియన్9
చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్25
సదరన్ రీజియన్3
వెస్టర్న్ రీజియన్‌15

India Post Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2023 ఫిబ్రవరి 28

దరఖాస్తుకు చివరి తేదీ- 2023 మార్చి 31 సాయంత్రం 5 గంటలు

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. హెవీ మోటార్ వెహికిల్, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ తప్పనిసరి.

అనుభవం- డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.

వయస్సు- 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం- రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్

వేతనం- ఎంపికైనవారికి ఏడో పే కమిషన్‌లోనే లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Manager, Mail Motor Service, Chennai, Tamil Nadu.

ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Airport Jobs: ఎయిర్‌పోర్ట్ కార్గోలో 400 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు

India Post Recruitment 2023: అప్లై చేయండి ఇలా

Step 1- ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.

Step 3- నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.

Step 4- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి.

Step 5- చివరి తేదీలోగా చేరేలా పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాలి.

First published:

Tags: India post, JOBS, Post office, Post office jobs, Postal jobs

ఉత్తమ కథలు