INDIA POST RECRUITMENT 2022 JOB NOTIFICATION RELEASED TO FILL 17 STAFF CAR DRIVER POSTS SS
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
India Post Recruitment 2022 | ఇండియా పోస్ట్ ఓ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 17 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అభ్యర్థులు పోస్టులో దరఖాస్తు పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతల గురించి తెలుసుకోండి.
పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ (India Post) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. తమిళనాడు పోస్టల్ సర్కిల్లో స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. కొయంబత్తూర్, ఈరోడ్, నీల్గిరీస్, సేలం, తిరుప్పూర్ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 10 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్స్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.
డిప్యుటేషన్, అబ్సార్ప్షన్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. ఎంపికైనవారికి ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
Step 5- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి.
Step 6- చివరి తేదీలోగా చేరేలా పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాలి.
ఇండియా పోస్ట్ వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా దేశంలో ఉన్న అన్ని పోస్టల్ సర్కిళ్లలో ఖాళీలను భర్తీ చేస్తోంది. పోస్ట్ ఆఫీస్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ ఫాలో కావాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.